ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

crime investigation: రాజస్థాన్‌లో యువతిపై గ్యాంగ్‌రేప్‌

ABN, Publish Date - Dec 27 , 2025 | 03:38 AM

ఐటీ సంస్థలో మేనేజర్‌గా పని చేస్తున్న ఓ యువతి కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి గురైంది. తాను పని చేస్తున్న సంస్థ సీఈవోతోపాటు సంస్థ ఎగ్జిక్యూటివ్‌ హెడ్‌ భర్త కలిసి ఆమెపై ....

  • నిందితుల్లో ఓ మహిళ.. ముగ్గురి అరెస్టు

ఉదయ్‌పూర్‌, డిసెంబరు 26: ఐటీ సంస్థలో మేనేజర్‌గా పని చేస్తున్న ఓ యువతి కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి గురైంది. తాను పని చేస్తున్న సంస్థ సీఈవోతోపాటు సంస్థ ఎగ్జిక్యూటివ్‌ హెడ్‌ భర్త కలిసి ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు. ఈ దారుణం జరుగుతున్నప్పుడు ఆ మహిళా ఎగ్జిక్యూటివ్‌ హెడ్‌ కూడా కారులోనే ఉండడం మరింత దిగ్ర్భాంతికరం! అస్వస్థతకు గురైన బాధితురాలిని ఇంటి దగ్గర దిగబెడతామని నమ్మించి అర్ధరాత్రి పూట కారులో ఎక్కించుకొని నిందితులు ఈ దారుణానికి పాల్పడ్డారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ ఘోరం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనమైంది. జేకేఎం అనే ఐటీ కంపెనీ సీఈవో జీతేశ్‌ సిసోడియా తన పుట్టినరోజు, న్యూ ఇయర్‌కు సంబంధించి ఈనెల 20న ఉదయ్‌పూర్‌లోని ఓ హోటల్‌లో విందు ఏర్పాటు చేశాడు. ఆ సంస్థకు చెందిన మహిళా ఎగ్జిక్యూటివ్‌ హెడ్‌ శిల్పా సిరోహి ఆహ్వానించడంతో బాధితురాలు కూడా ఆ పార్టీకి హాజరైంది. రాత్రి 1:30 వరకు ఆమె అక్కడే ఉంది. పార్టీ ముగిశాక.. తన ఒంట్లో నలతగా అనిపించడంతో ఆమె ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైంది. తాను కారులో ఇంటి వద్ద దిగబెడతానంటూ శిల్పా సిరోహి, ఆ యువతిని తన వాహనంలో ఎక్కించుకుంది. అప్పటికే ఆ కార్లో శిల్ప భర్త గౌరవ్‌, సంస్థ సీఈవో జీతేశ్‌ ఉన్నారు. మార్గమధ్యలో ఓ దుకాణం వద్ద కారును ఆపిన నిందితులు.. పొగపీల్చే పదార్థాలను తీసుకున్నారు. ముగ్గురు కలిసి బాధితురాలితోనూ పొగ తాగించగా ఆ ప్రభావంతో ఆమె స్పృహ కోల్పోయింది. కొద్దిగా స్పృహలోకి వచ్చేసరికి తనపై జీతేశ్‌ లైంగికదాడికి పాల్పడుతున్నట్లుగా బాధితురాలు గుర్తించింది. జితేశ్‌తో పాటు గౌరవ్‌ కూడా తనపై లైంగిక దాడికి తెగబడినట్టు గ్రహించింది. ఈ ఘోరానికి సంబంధించిన కీలక ఆధారాలను పోలీసులు ఇప్పటికే సేకరించారు. ఈమేరకు కారులోని వెబ్‌క్యామ్‌లో నిందితులు ఒడిగట్టిన దారుణం తాలుకు ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేశారు.

Updated Date - Dec 27 , 2025 | 03:38 AM