ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Haridwar: బాయ్‌ఫ్రెండ్‌కు కూతురిని బలిచేసిన వివాహిత

ABN, Publish Date - Jun 05 , 2025 | 09:08 PM

ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. తన కన్న కూతురిపై బాయ్‌ఫ్రెండ్ అఘాయిత్యానికి పాల్పడేలా ప్రోత్సహించింది. బాధితురాలు తండ్రికి చెప్పడంతో ఈ దారుణం గురించి వెలుగులోకి వచ్చింది.

ఇంటర్నెట్ డెస్క్: హరిద్వార్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ప్రియుడి మాయలో పడి ఓ వివాహిత తన కన్న కూతురి జీవితాన్ని నాశనం చేసింది. మహిళ బాయ్‌ఫ్రెండ్, అతడి స్నేహితుడు బాలికపై అత్యాచారానికి ఒడిగట్టేలా రెచ్చగొట్టింది. తల్లి చేసిన దారుణం గురించి బాలిక తండ్రికి చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

జరిగిన దారుణం గురించి బాలిక తన తండ్రికి చెప్పడంతో ఆయన షాకైపోయారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిందితురాలు అనామిక శర్మ, ఆమె బాయ్‌ఫ్రెండ్ సుమిత్ పట్వాల్‌తో పాటు అతడి స్నేహితుడిపై పోలీసులు పోక్సోతో పాటు వివిధ సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. నిందితురాలు, తన బాయ్‌ఫ్రెండ్‌తో ఓ హోటల్‌లో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణంలో పట్వాల్‌కు సహకరించిన అతడి స్నేహితుడిని కూడా అరెస్టు చేశారు.


ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్యలో నిందితులు బాలికపై పలుమార్లు దారుణానికి ఒడిగట్టారని పోలీసులు తెలిపారు. ఈ విషయం ఎవరికైనా చెబితే బాలిక తండ్రిని చంపేస్తామని కూడా వారు చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు. హరిద్వార్‌తో పాటు ఆగ్రా, బృందావన్‌లో నిందితులు అఘాయిత్యాలకు పాల్పడినట్టు చెప్పారు. ఇక భర్త నుంచి విడిపోయిన అనామిక శర్మ తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉంటోంది.


జాతీయ కథనాల ప్రకారం, శర్మ గతంలో హరిద్వార్ జిల్లా బీజేపీ మహిళా మోర్చాకు నేతృత్వం వహించింది. అయితే, ఆగస్టు 2024 నుంచి ఆమెకు పార్టీలో ఎటువంటి బాధ్యతలు అప్పగించలేదని బీజేపీ వర్గాలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి:

చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య

భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..

Read Latest and Crime News

Updated Date - Jun 05 , 2025 | 09:15 PM