HYDRA: చెరువుల్లో వ్యర్థాలు డంప్ చేస్తోన్న టిప్పర్లు సీజ్..
ABN, Publish Date - Feb 05 , 2025 | 09:01 AM
నిర్మాణరంగ, ఇతర వ్యర్థాల అక్రమ డంపింగ్‌పై కఠినంగా వ్యవహరించాలని హైడ్రా(HYDRA) నిర్ణయించింది. చెరువులు, నాలాలు, ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు పోసే వాహనాలపై సంస్థ బృందాలు ప్రత్యేక నిఘా పెట్టాయి.
-ఉందాసాగర్, దేవులపల్లి చెరువు వద్ద ఐదు వాహనాలను పట్టుకున్న హైడ్రా
హైదరాబాద్ సిటీ: నిర్మాణరంగ, ఇతర వ్యర్థాల అక్రమ డంపింగ్‌పై కఠినంగా వ్యవహరించాలని హైడ్రా(HYDRA) నిర్ణయించింది. చెరువులు, నాలాలు, ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు పోసే వాహనాలపై సంస్థ బృందాలు ప్రత్యేక నిఘా పెట్టాయి. పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి అక్రమంగా వ్యర్థాలు డంప్ చేస్తోన్న నాలుగు టిప్పర్లను హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్‌ఎఫ్) బృందాలు పట్టుకున్నాయి. ఉందాసాగర్(Undasagar)లో వ్యర్థాలు పోస్తోన్న నాలుగు టిప్పర్లు, పోసిన మట్టిని వెంటనే చదును చేస్తోన్న ప్రొక్లెయినర్‌నూ పట్టుకున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Secunderabad: రైల్వేస్టేషన్‌లో 56 కిలోల గంజాయి పట్టివేత
అనంతరం బండ్లగూడ పోలీస్ స్టేషన్(Bandlaguda Police Station)లో వాహనాలు, డ్రైవర్ క్లీనర్‌ను అప్పగించి వారిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవులపల్లి (సమర్‌కుంట) చెరువులో మట్టి పోస్తోన్న మరో లారీని పట్టుకున్నారు. వాహనం, డ్రైవర్, క్లీనర్‌ను పోలీసులకు అప్పగించారు. వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో మట్టి, ఇతర వ్యర్థాలు పోస్తే కేసులు నమోదు చేస్తామని, అన్ని ప్రాంతాల్లో హైడ్రా బృందాల నిఘా ఉందని కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు.
ఈవార్తను కూడా చదవండి: ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల ఘాటు రిప్లై
ఈవార్తను కూడా చదవండి: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే..
ఈవార్తను కూడా చదవండి: చిక్కరు.. దొరకరు!
ఈవార్తను కూడా చదవండి: ఆయన బతికే ఉన్నారు.. మావోయిస్టుల సంచలన లేఖ
Read Latest Telangana News and National News
Updated Date - Feb 05 , 2025 | 09:06 AM