Hyderabad: వాళ్ల చేతిలో చావడం కన్నా..
ABN, Publish Date - Jan 29 , 2025 | 11:26 AM
అత్తమామల వేధింపులు భరించలేక ఓ డాక్టర్ సెల్ఫీ వీడియో(Selfie video) తీసుకొని ఆత్మహత్యకు యత్నించింది. ఫెర్నాండేజ్ ఆస్పత్రిలో గైనకాలజిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ ప్రణీతరెడ్డి, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సికిందర్‌రెడ్డి 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు.
- అత్తమామల వేధింపులు భరించలేక డాక్టర్ ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: అత్తమామల వేధింపులు భరించలేక ఓ డాక్టర్ సెల్ఫీ వీడియో(Selfie video) తీసుకొని ఆత్మహత్యకు యత్నించింది. ఫెర్నాండేజ్ ఆస్పత్రిలో గైనకాలజిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ ప్రణీతరెడ్డి, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సికిందర్‌రెడ్డి 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లపాటు అమెరికాలో ఉన్న వీరు 2021లో నగరానికి తిరిగి వచ్చి చంపాపేట్ ప్రెస్ కాలనీలో నివసిస్తున్నారు. వీరికి నాలుగున్నరేళ్ల పాప (విహ) ఉంది. దంపతుల మధ్య గొడవలు జరగడంతో పలుమార్లు సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్(Saroornagar Police Station) వరకు వెళ్లాయి. ప్రస్తుతం విడాకుల కేసు కోర్టులో ఉంది. గొడవల నేపథ్యంలో సికిందర్‌రెడ్డి ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: అమ్మకు బై.. బై చెప్పి పాఠశాలకు..
అప్పటి నుంచి ప్రణీతరెడ్డికి అత్తమామల వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. పై పోర్షన్‌లో అత్తమామలు నివసిస్తుండగా, కింది పోర్షన్‌లో ప్రణీత, కుమార్తె, ఆమె తల్లి ఉంటున్నారు. అత్తాకోడళ్ల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి మరలా గొడవ జరగగా ప్రణీత సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. ఇన్‌స్పెక్టర్ పట్టించుకోకపోగా, అక్కడ ఎందుకు ఉంటున్నావు, వేరుగా ఉండొచ్చుకదా అని ఉచిత సలహా ఇచ్చాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మంగళవారం డాక్టర్ ప్రణీత బర్త్ డే. అత్తమామల వేధింపులు, పోలీసులు పట్టించుకోకపోవడంతో గుర్తుతెలియని మాత్రలు వేసుకొని సెల్ఫీ వీడియోలో.. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఆత్మహత్యకు యత్నించింది. ఆమె చంపాపేటలోని జీవన్‌ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
సీఎం సెక్యూరిటీ ఆఫీస్ నుంచి పోలీసులకు ఫోన్
డాక్టర్ ప్రణీత అత్తమామలకు మద్దతుగా సీఎం సెక్యూరిటీ ఆఫీసులో పనిచేస్తున్న చక్రీధర్‌రెడ్డి పోలీసులకు తరచూ ఫోన్ చేసేవారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రణీత సెల్ఫీ వీడియో వైరల్ అయింది. అత్తమామల ఇంటి ఎదుట ఆమె బంధువులు ధర్నా చేపట్టారు.
సూసైడ్ నోట్‌లో..
‘పోలీస్ డౌన్.. డౌన్.. నో జస్టిస్.. ప్రొటెక్ట్ చేయాల్సిన మీరే ఏమీ పట్టనట్లు కూర్చున్నారు. నాకు న్యాయం జరగకముందే మా అత్తమామలు నన్ను చంపేస్తారు. వాళ్ల చేతుల్లో హింసలు అనుభవిస్తూ చావడం కన్నా.. ఇలా పీస్‌ఫుల్ ఇన్‌స్లీ్‌ప బెటర్’ అని డాక్టర్ ప్రణీతరెడ్డి సూసైడ్ నోట్‌లో రాసిన మాటలు పలువురిని కంటతడిపెట్టిస్తున్నాయి. తన కుమార్తె విహారెడ్డిని జాగ్రత్తగా చూడాలని తల్లిదండ్రులను వేడుకుంది. నాలా అమాయకంగా పెంచొద్దని, ధైర్యంగా ఉండేలా పెంచాలని సూచించింది. ‘సారీ విహ.. టాటా.. మామ్ పై కోపం పెట్టుకోకు. అమ్మ, నాన్న, తమ్ముడు, అన్నయ్య, వదిన, పిన్నీ, బాబాయ్. మీరంతా నన్ను ప్రేమతో చూసుకున్నారు. నేను ప్రేమ వివాహం చేసుకోవడం వల్ల మీరందరూ బాధపడుతున్నారు. నా వల్ల మీరు ఎన్నో అవమానాలు భరించారు. ఇక మీకు నా నుండి ఎలాంటి కష్టాలు ఉండవు. ప్లీజ్ నన్ను క్షమించండి. విహలో నన్ను చూసుకోండి’ అనిపేర్కొంది.
వీరే కారణం
భర్త కె.సికిందర్‌రెడ్డి, అత్త స్వరూప, మామ కె.వెంకట్‌రెడ్డి, ఆడపడుచులు ఝాన్సీ, నవ్య, సీహెచ్ సౌషీల్, కేకే సంకీర్త్, అత్తలు ఎస్.సులోచన, డి.పుష్ప, సీహెచ్.పద్మ (సులోచన తల్లి), పరోక్షంగా అద్దెంట్లో నివసిస్తున్న బి. సృజన్, రేష్మ, పార్వతమ్మ, అంకుల్ మల్లారెడ్డి అని సూసైడ్‌లో నోట్‌లో ప్రణీత రాసింది. భర్త సికిందర్‌రెడ్డి ఎప్పటికైనా తిరిగి వస్తాడన్న ఆశతో చట్టపరంగా ఎదుర్కోవడానికి తాను చేసే ప్రయత్నానికి అత్తమామలు, ఇతర బంధువుల వేధింపులపై ఫిర్యాదు చేస్తే ఇన్‌స్పెక్టర్ సైదిరెడ్డి పట్టించుకోలేదని, అత్తమామలకే ఆయన మద్దతు తెలిపేవాడని సూసైడ్ నోట్‌లో రాసింది. తనకు జరిగిన అన్యాయంపై ఏసీపీ, డీసీలను సంప్రదించినా వేధింపులు తగ్గలేదని అందులో వివరించింది.
పోలీస్‌స్టేషన్ ఎదుట బంధువుల ఆందోళన
డాక్టర్ ప్రణీతరెడ్డి ఆత్మహత్యాయత్నానికి నిరసనగా బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట మంగళవారం రాత్రి ఆందోళనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రణీతరెడ్డి ఆత్మహత్యాయత్నానికి కారకులైన అత్తమామ, ఇతర కుటుంబ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy : పిచ్చోడు.. తిక్కలోడు
ఈవార్తను కూడా చదవండి: ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల ఘాటు రిప్లై
ఈవార్తను కూడా చదవండి: High Alert: హై అలర్ట్‌గా తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దు..
ఈవార్తను కూడా చదవండి: TG News: ఛీ ఛీ అనిపించుకోను
Read Latest Telangana News and National News
Updated Date - Jan 29 , 2025 | 11:26 AM