Hyderabad: అమ్మకు బై.. బై చెప్పి పాఠశాలకు..
ABN , Publish Date - Jan 29 , 2025 | 10:56 AM
నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో భారీ వాహనాలు ఇద్దరు విద్యార్థులను బలిగొన్నాయి. షేక్‌పేట(Shakepet) పరిధిలో తండ్రితో హుషారుగా పాఠశాలకు బైక్‌పై వెళ్లిన విద్యార్థిని వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో చక్రాలకింద పడి చిన్నారి మృతిచెందింది.
- రోడ్డు ప్రమాదంలో చిన్నారి దుర్మరణం
- మరో ఘటనలో టిప్పర్ ముందు చక్రాల కింద నలిగి విద్యార్థి మృతి
- డ్రైవర్ల నిర్లక్ష్యాల వల్లే ప్రమాదాలు
నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో భారీ వాహనాలు ఇద్దరు విద్యార్థులను బలిగొన్నాయి. షేక్‌పేట(Shakepet) పరిధిలో తండ్రితో హుషారుగా పాఠశాలకు బైక్‌పై వెళ్లిన విద్యార్థిని వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో చక్రాలకింద పడి చిన్నారి మృతిచెందింది. మేడిపల్లి పోలీస్‌స్టేషన్(Medipalli Police Station) పరిధిలో ట్యూషన్‌కు వెళ్లి స్కూటీపై వస్తున్న పదో తరగతి విద్యార్థి తన ముందు వెళ్తున్న ఓ టిప్పర్ ఆకస్మికంగా యూటర్న్ తీసుకోవడంతో దాని ముందు టైర్‌ను ఢీకొట్టాడు. లారీ చక్రాలు అతనిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రెండు సంఘటనల్లోనూ లారీ డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరిగాయని ప్రత్యక్షసాక్షులు ఆరోపిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.
ఈ వార్తను కూడా చదవండి: CP CV Anand: సైబర్ నేరాల ముప్పును సమర్ధవంతంగా ఎదుర్కోవాలి
హైదరాబాద్: ఆ పాప అమ్మకు టాటా చెప్పి తండ్రితో హుషారుగా పాఠశాలకు బయలుదేరింది.ద్విచక్ర వాహనంపై వెళుతూ కబుర్లు చెబుతుండగా తండ్రి మురిసిపోతూ ముందుకు వెళుతున్నాడు. ఇంతలో పక్క నుంచి పెను భూతంలా వచ్చిన ఓ లారీ ఆ పాపను కబళించింది. హైదరాబాద్ షేక్‌పేట మై రెయిన్‌బో అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న గడ్డం హేమసుందర్ రెడ్డి ఓ చానెల్‌లో మీడియా మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె గడ్డం అతర్వి (10) ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఐదో తరగతి చదువుతోంది.
మంగళవారం ఉదయం కుమార్తెను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని హేమసుందర్‌రెడ్డి పాఠశాలకు బయలుదేరారు. షేక్‌పేట హనుమాన్ దేవాలయం వద్దకు వెళ్లగానే పక్క నుంచి వెళ్తున్న ఓ లారీ అకస్మాత్తుగా టర్నింగ్ తీసుకోవడంతో వారి ద్విచక్ర వాహనం దానిని ఢీకొంది. ఈ ఘటనలో హేమసుందర్ ఓ వైపు, బాలిక మరోవైపు పడ్డారు. లారీ వెనుక చక్రాలు బాలికపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా సిగ్నల్ ఇవ్వకుండా ఒక్కసారిగా లారీని పక్కకు తిప్పడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ యాసిన్ ఖురేషీని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
టిప్పర్ సడెన్ యూటర్న్‌తో...
పీర్జాదిగూడ, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): ట్యూషన్‌కు వెళ్లి వస్తుండగా ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్ మండలం, కాచవాని సింగారంలో నివసిస్తున్న మోతీరాం కుమారుడు తేజ చౌదరి(14) నారపల్లి దివ్యానగర్‌లోని నల్లమల్లారెడ్డి పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. సోమవారం ఉదయం స్కూటీపై పర్వతాపూర్‌లో ట్యూషన్‌కు వెళ్లి తిరిగి వస్తున్నాడు. కాచవానిసింగారం సమీపంలోకి రాగానే ముందు నుంచి వెళ్తున్న టిప్పర్ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుంది. ఈ క్రమంలో తేజ టిప్పర్ ముందు టైర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో టైర్ కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy : పిచ్చోడు.. తిక్కలోడు
ఈవార్తను కూడా చదవండి: ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల ఘాటు రిప్లై
ఈవార్తను కూడా చదవండి: High Alert: హై అలర్ట్‌గా తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దు..
ఈవార్తను కూడా చదవండి: TG News: ఛీ ఛీ అనిపించుకోను
Read Latest Telangana News and National News