ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Crime news: కారులో రూ.20 లక్షల గంజాయి సీజ్

ABN, Publish Date - Jan 24 , 2025 | 12:48 PM

తెలంగాణలోని భద్రాచలం ఎక్సైజ్ చెక్పోస్ట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వాహనాలను తనిఖీ చేస్తున్న సందర్భంలో ఓ కారుపై అనుమానం వచ్చింది. దీంతో వాహనాన్ని ఆపి, క్షుణ్ణంగా పరిశీలించగా.. అందులో..

రోజురోజుకూ నేరాలు పెరిగిపోతున్నాయి. ఇక నిషేధిక వస్తువులను అక్రమ రవాణా చేసే ఘటనలు నిత్యం ఎక్కడోచోట జరుగుతూనే ఉన్నాయి. కొందరు విమానాశ్రయాలను అడ్డగా చేసుకుని బంగారు, డ్రగ్స్ వంటి నిషేధిత వస్తువులతో పాటూ పాములు, కొండచిలువలు వంటి జీవులను కూడా తరలించడం చూస్తున్నాం. తాజాగా, తెలంగాణలోని భద్రాచలంలో పోలీసులు రూ.20 లక్షల గంజాయిని సీజ్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.


తెలంగాణలోని (Telangana) భద్రాచలం ఎక్సైజ్ చెక్పోస్ట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వాహనాలను తనిఖీ చేస్తున్న సందర్భంలో ఓ కారుపై అనుమానం వచ్చింది. దీంతో వాహనాన్ని ఆపి, క్షుణ్ణంగా పరిశీలించగా.. అందులో 82 కేజీల గంజాయి (Ganja in car) కనిపించింది. దాన్ని సీజ్ చేసుకున్న పోలీసులు కారును స్వాధీనం చేసుకుని, ఇద్దరికి అరెస్ట్ చేశారు. ఆ గంజాయి విలువ సుమారు రూ.20.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఒరిస్సా నుంచి కేరళకు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Updated Date - Jan 24 , 2025 | 12:48 PM