Bengaluru: ఆస్పత్రికి వెళ్లొస్తూ.. అనంత లోకాలకు..
ABN, Publish Date - Mar 04 , 2025 | 07:44 AM
తండ్రి ఆస్పత్రిలో ఉన్నారని పరామర్శకు వెళ్లి వస్తున్న కుటుంబ సభ్యులు మృత్యువాత పడ్డారు. బెంగళూరు-వి.కోట(Bangalore-V.Kota) మధ్య ఇటీవల మొదలైన ఎక్స్‌ప్రెస్ వే(Express way)లో కర్నాటక రాష్ట్రం బంగారుపేట తాలూకా కుప్పనల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
- కేజీఎఫ్-మాలూరు మధ్య ఎక్స్‌ప్రెస్ వేలో ఘోర రోడ్డు ప్రమాదం
- బైక్‌ను ఢీకొన్న ఇన్నోవా వాహనం
- నలుగురి దుర్మరణం
- మరో నలుగురికి తీవ్రగాయాలు
బెంగళూరు: తండ్రి ఆస్పత్రిలో ఉన్నారని పరామర్శకు వెళ్లి వస్తున్న కుటుంబ సభ్యులు మృత్యువాత పడ్డారు. బెంగళూరు-వి.కోట(Bangalore-V.Kota) మధ్య ఇటీవల మొదలైన ఎక్స్‌ప్రెస్ వే(Express way)లో కర్నాటక రాష్ట్రం బంగారుపేట తాలూకా కుప్పనల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కర్నాటక రాష్ట్రం కదిరిగానికుప్పంకు చెందిన శీనప్ప బెంగళూరు ఆసుపత్రిలో ఉండగా ఆయన కుమారుడు మహేష్ కుమార్ వారి కుటుంబ సభ్యులతో కలసి ఆసుపత్రికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఆదివారం అర్థరాత్రి వారు ప్రయాణిస్తున్న ఇనోవా కారు రోడ్డు ప్రమాదానికి గురైంది.
ఈ వార్తను కూడా చదవండి: MLA: తేల్చిచెప్పేశారు.. ‘కంబళ’ను ఆపే ప్రసక్తే లేదు..
మాలూరు-కేజీఎఫ్(Maluru-KGF) మద్యన ఎక్స్‌ప్రెస్ వేలో కుప్పనల్లి సమీపంలో కారుకు ఎదురుగా ద్విచక్ర వాహనం లైటులేకుండా అడ్డురావడంతో ప్రమాదవశాత్తు కారు, ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహన దారుడితో పాటు, కారులో ప్రయాణిస్తున్న కమ్మసంద్ర గ్రామానికి చెందిన మహేశ్ (45), రత్నమ్మ (60), ఉద్విత (2)తోపాటు ద్విచక్రవాహనం నడుపుతున్న శ్రీనాథ్ (30) అక్కడికక్కడే మృతి చెందారు. వీరితో పాటు కారులో ప్రయాణిస్తున్న పూగానిపల్లెకు చెందిన చంద్రప్ప భార్య సుజాత(48), ఆమె కుమారై సుష్మిత(30), ఆమె కుమారుడు విరాట్ (4), కారు డ్రైవర్ సునిల్‌కుమార్‌లు తీవ్రంగా గాయపడ్డారు.
వీరిని కోలారు మెడికల్ కళాశాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 8 నెలల గర్భిణి అయిన సుష్మిత కడుపులోని పాపను కాపాడేందుకు వైద్యులు శస్త్ర చికిత్స చేసినా పాపను కాపాడలేక పోయినట్లు బంధువులుతెలిపారు. సుష్మిత పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను బెంగళూరుకు తరలించి అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతోంది. సుజాత, విరాఠ్, సునిల్‌ల పరిస్థితి అదుపులోనే ఉందని ఆసుపత్రి వర్లా ద్వారా సమాచారం. ఈ ఘటనలో ఇనోవా కారు పూర్తిగా ధ్వంసంకాగా, కారు ఢీకొన్న తీవ్రతకు ద్విచక్ర వాహనం ముక్కలు ముక్కలైంది.
ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు బందువులు మృత్యువాత పడటంతో ఆ కుటుంబంలో తీరని విషాదం అలముకుంది. ఇటీవల ట్రయల్ రన్ కోసం వాహనాలను అనుమతించిన ఎక్స్‌ప్రెస్ వేలో బంగారుపేట- కేజీఎఫ్ మద్యన వాహనాలు అతివేగంగా ఒకే వైపు వస్తుండటం వల్లే తరచు ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. బంగారుపేట పోలీసులు కేసు రమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంగారుపేట ప్రభుత్వాసుపత్రిలో మృతదేమాలకు పోస్టుమార్టం అనంతరం బందువుల ఆర్తనాదాల మద్య మృతదేహాలను వారి స్వగ్రామాలకు అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: మెట్రో స్టేషన్ల నుంచి స్కైవాక్‌లు
ఈ వార్తను కూడా చదవండి: మరో ప్రముఖ ఆలయాన్ని దర్శించుకున్న బాలీవుడ్ నటి.. ఎవరంటే..
ఈ వార్తను కూడా చదవండి: పోచారంపై నిప్పులు చెరిగిన కవిత
ఈ వార్తను కూడా చదవండి: కృష్ణా జలాల్లో మాకు 70% వాటా ఇవ్వండి
Read Latest Telangana News and National News
Updated Date - Mar 04 , 2025 | 07:46 AM