Share News

MLA: తేల్చిచెప్పేశారు.. ‘కంబళ’ను ఆపే ప్రసక్తే లేదు..

ABN , Publish Date - Mar 04 , 2025 | 07:14 AM

కంబళ క్రీడను అభిమానించేవారు ఎప్పటివరకు ఉంటారో... అప్పటిదాకా కొనసాగిస్తామని ప్రాణిదయాసంఘం (పెటా) తమ జోలికి రావద్దంటూ పుత్తూరు ఎమ్మెల్యే అశోక్‌కుమార్‌ రై(Puttur MLA Ashok Kumar Rai) తెలిపారు.

MLA: తేల్చిచెప్పేశారు.. ‘కంబళ’ను ఆపే ప్రసక్తే లేదు..

- ‘పెటా’ వారు మా జోలికి రాకండి

- ముంబై, చెన్నైలోనే కాదు.. సాధ్యమైతే దుబాయ్‌లోనూ నిర్వహిస్తాం: ఎమ్మెల్యే అశోక్‌కుమార్‌ రై

బెంగళూరు: కంబళ క్రీడను అభిమానించేవారు ఎప్పటివరకు ఉంటారో... అప్పటిదాకా కొనసాగిస్తామని ప్రాణిదయాసంఘం (పెటా) తమ జోలికి రావద్దంటూ పుత్తూరు ఎమ్మెల్యే అశోక్‌కుమార్‌ రై(Puttur MLA Ashok Kumar Rai) తెలిపారు. ముంబై, చెన్నైలలోనే కాదని సాధ్యమైతే దుబాయ్‌లోనూ కంబళ పోటీలు నిర్వహించే ఆలోచన ఉందన్నారు. దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు మహాలింగేశ్వర ఆలయం దేవరమారు గద్దెలో కంబళపోటీలను ఉద్దేశించి ఆయన ఆదివారం మాట్లాడారు. ఏటా కంబళ క్రీడలను అభిమానించేవారు పెరుగుతున్నారన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: మండిపోతాయ్‌ జాగ్రత్త...


కానీ పెటా సభ్యులు వ్యవస్థీకృతంగా న్యాయపోరాటం చేస్తున్నారన్నారు. కంబళను నిలిపివేసేందుకు వారి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారన్నారు. మాజీ మంత్రి వినయ్‌కుమార్‌ సొరకె(Former Minister Vinay Kumar Sorake) మాట్లాడుతూ జానపద వీరక్రీడగా కంబళకు పేరుందన్నారు. వ్యవసాయ పనులు తక్కువగా ఉండే సందర్భంలో రైతులు ఆత్మాభిమానంతో కంబళ క్రీడ పట్ల ఆసక్తి చూపుతారన్నారు.


pandu2.2.jpg

కంబళ కేవలం తీర ప్రాంత జిల్లాలకే పరిమితం కాలేదని బెంగళూరు(Bengaluru) నుంచి నటులతో పాటు ప్రముఖులు వస్తుంటారన్నారు. విదేశాలలో నివసించే తీరప్రాంత జిల్లాల వాసులు పోటీలు చూసేందుకు వస్తుంటారన్నారు. విధానపరిషత్‌ సభ్యుడు ఐవాన్‌ డిసౌజా, ముత్తప్పరై, దయానందరైకోర్మండ, ఎడపదవు స్వామి ప్రేమనాథశెట్టి, కంబళ సమితి అధ్యక్షులు చంద్రహా్‌సశెట్టి సహా పలువురు పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: మెట్రో స్టేషన్ల నుంచి స్కైవాక్‌లు

ఈవార్తను కూడా చదవండి: మరో ప్రముఖ ఆలయాన్ని దర్శించుకున్న బాలీవుడ్ నటి.. ఎవరంటే..

ఈవార్తను కూడా చదవండి: పోచారంపై నిప్పులు చెరిగిన కవిత

ఈవార్తను కూడా చదవండి: కృష్ణా జలాల్లో మాకు 70% వాటా ఇవ్వండి

Read Latest Telangana News and National News

Updated Date - Mar 04 , 2025 | 07:14 AM