ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: సైబర్‌ వారియర్స్‌గా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌..

ABN, Publish Date - Feb 25 , 2025 | 09:50 AM

ఆన్‌లైన్‌ వేదికగా జరుగుతున్న సైబర్‌ మోసాలపై అదే వేదిక ద్వారా ప్రజలకు అవగాహన కలిగించి కట్టడి చేయాలని పోలీసులు సరికొత్త కార్యాచరణ మొదలు పెట్టారు. పేరొందిన సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల(Social media influencers)ను ఇందులో భాగస్వామ్యం చేస్తూ వారితో ప్రచారం చేయిస్తున్నారు.

- నేరాల కట్టడికి పోలీసుల కార్యాచరణ

- ఏడాది పొడవునా ప్రచారం

హైదరాబాద్‌ సిటీ: ఆన్‌లైన్‌ వేదికగా జరుగుతున్న సైబర్‌ మోసాలపై అదే వేదిక ద్వారా ప్రజలకు అవగాహన కలిగించి కట్టడి చేయాలని పోలీసులు సరికొత్త కార్యాచరణ మొదలు పెట్టారు. పేరొందిన సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల(Social media influencers)ను ఇందులో భాగస్వామ్యం చేస్తూ వారితో ప్రచారం చేయిస్తున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Maha Shivaratri: శైవక్షేత్రాలకు టూరిజం బస్సులు..


ప్రాజెక్టు ‘ప్రొటెక్ట్‌’తో మంచి ఫలితాలు

సైబర్‌ నేరాల కట్టడికి ఏం చేయాలన్న దానిపైనే సైబర్‌ క్రైం విభాగం పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ప్రాజెక్ట్‌ ప్రొటెక్ట్‌ (పీఆర్‌ఓటీఈసీటీ-ప్రివెంటింగ్‌ రిస్క్స్‌ ఆన్‌లైన్‌ త్రూ ఎడ్యుకేషన్‌ కొలాబరేషన్‌ అండ్‌ ట్రైయినింగ్‌) ప్రాజెక్టును రెండు నెలల కిత్రం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుతో మంచి ఫలితాలు వచ్చాయని, 2025లో ప్రారంభమైన తర్వాత నేరాల సంఖ్య కొంత తగ్గిందని సైబరాబాద్‌ సైబర్‌ క్రైం ఉన్నతాధికారొకరు తెలిపారు.


‘సైబరాబాద్‌ సెక్యూరిటీ’ భాగస్వామ్యం

ఐటీ కంపెనీల ప్రతినిధులతో కొనసాగుతున్న సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్‌సీఎ్‌ససీ)ను సైబర్‌ నేరాల కట్టడిలో భాగస్వామ్యం చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఇప్పటికే ఎస్‌సీఎస్‏సీతో కలిసి ఐటీ కారిడార్‌లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోషల్‌ మీడియా ద్వారానే తక్కువ సమయంలో ఎక్కువ మందిని సైబర్‌ క్రైం బారిన పడకుండా ఉండేలా చైతన్యపరచాలని కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.


కార్పొరేట్‌ కంపెనీల వినియోగం

ప్రపంచవ్యాప్తంగా వ్యాపార కార్యకలాపాల ప్రమోషన్లకు, ప్రచారాలకు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను కార్పొరేట్‌ కంపెనీలు విరివిగా వినియోగించుకుంటున్నాయి. అదే బాటలో పోలీసులూ నడవాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం, యూట్యూట్‌, ట్విట్టర్‌ వంటి సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌లపై సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించిన సైబర్‌ క్రైం పోలీసులు ఇప్పుడు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో ప్రచారం చేయించనున్నారు. సోషల్‌మీడియా వేదికగా అవగాహన, చైతన్య పరిచే ప్రచార కార్యక్రమాలను రూపొందించనున్నారు.


ఈవార్తను కూడా చదవండి: ఏఆర్‌ డెయిరీ ఎండీకి చుక్కెదురు

ఈవార్తను కూడా చదవండి: మేళ్లచెర్వులో మొదలైన జాతర సందడి

ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: బీఆర్‌ఎస్‌తో రేవంత్‌ కుమ్మక్కు

ఈవార్తను కూడా చదవండి: బాసరలో కిటకిటలాడుతున్న క్యూ లైన్లు, అక్షరాభ్యాస మండపాలు

Read Latest Telangana News and National News

Updated Date - Feb 25 , 2025 | 09:50 AM