ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gurugram: ఐసీయూలో ఎయిర్‌హోస్టస్‌పై అత్యాచారం.. ఎట్టకేలకు పోలీసుల అదుపులో నిందితుడు

ABN, Publish Date - Apr 18 , 2025 | 10:27 PM

గురుగ్రామ్‌లో సంచలనం కలిగించిన ఎయిర్‌హోస్టస్‌పై ఆసుపత్రిలో అత్యాచారం ఘటనలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Gurugram

ఇంటర్నెట్ డెస్క్: గురుగ్రామ్‌లో సంచలనం కలిగించిన ఎయిర్‌హోస్టస్‌పై ఆసుపత్రిలో అత్యాచారం ఘటనలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసును ఛేదించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం దాదాపు 800 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని జల్లెడపట్టి నిందితుడి జాడ కనిపెట్టారు. అతడి పేరు దీపక్ (25) అని, ఆసుపత్రిలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నట్టు తెలిపారు.


ఏప్రిల్ 6న గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రి ఐసీయూలో ఈ దారుణం జరిగింది. వెంటిలేటర్‌పై ఉన్న తనపై నిందితుడు దీపక్ అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు(46) పేర్కొంది. తాను బలహీన స్థితిలో ఉండటంతో అతడిని అడ్డుకోలేకపోయినట్టు తెలిపింది. ఘటన జరిగిన సమయంలో ఇద్దరు నర్సులు ఉన్నా జోక్యం చేసుకోలేదని వాపోయింది. ఏప్రిల్ 13న ఆమె తన భర్తకు ఈ విషయం చెప్పడంతో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు మరుసటి రోజు సదర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ మరుసటి రోజు ఘటనపై స్పందించిన ఆసుపత్రి యాజమాన్యం దారుణం జరిగిన విషయాన్ని అంగీకరించింది. పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొంది.


మధ్యప్రదేశ్‌లో జరిగిన మరో ఘటనలో 17 ఏళ్ల మైనర్ బాలిక తన భర్తకు ప్రియుడి సాయంతో హత్య చేసింది. ప్రియుడి ప్లాన్ ప్రకారం, భర్తను కత్తితో పొడిచి చంపిన ఆమె ఆ తరువాత ప్రియుడికి వీడియో కాల్ చేసి పని అయిపోయిందని తెలిపింది. మొబైల్ ఫోన్ లొకేషన్ ద్వారా ఆమె జాడ కనుక్కున్న పోలీసులు బాలికతో పాటు ఆమెకు సహరించిన మరో ఇద్దరిని, ప్రియుడికి అరెస్టు చేశారు. ప్లాన్ ప్రకారమే ఈ హత్య చేసినట్టు నిందితులు పోలీసు విచారణ సందర్భంగా అంగీకరించారు.

ఇవి కూడా చదవండి:

మాజీ బాయ్‌ఫ్రెండే కాబోయే మామగారు.. యువతి లైఫ్‌లో వింత ట్విస్ట్

తల్లి హృదయం ఎంత గొప్పది.. చిరుత దాడిలో గాయపడ్డా లెక్క చేయక ఈ తల్లి శునకం..

రూల్స్‌కు విరుద్ధంగా చీతాల దాహం తీర్చినందుకు అటవీ శాఖ సిబ్బందిపై వేటు

Read Latest and Crime News

Updated Date - Apr 18 , 2025 | 10:27 PM