Hyderabad: మహిళా వ్యాపారవేత్తకు ఆన్‌లైన్‌లో వేధింపులు..
ABN, Publish Date - Feb 20 , 2025 | 08:08 AM
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతూ వేధిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మహిళా సైబర్ క్రైం(Cybercrime)లో ఫిర్యాదు చేశారు. నగరానికి చెందిన మహిళా పారిశ్రామికవేత్త(26) ఆన్‌లైన్‌లో వ్యాపారం చేస్తున్నారు.
- సైబర్ క్రైం ఠాణాలో బాధితురాలు ఫిర్యాదు
హైదరాబాద్ సిటీ: సోషల్ మీడియా(Social media)లో అసభ్యకర పోస్టులు పెడుతూ వేధిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మహిళా సైబర్ క్రైం(Cybercrime)లో ఫిర్యాదు చేశారు. నగరానికి చెందిన మహిళా పారిశ్రామికవేత్త(26) ఆన్‌లైన్‌లో వ్యాపారం చేస్తున్నారు. వ్యాపార అభివృద్ధి కోసం యూట్యూబ్ చానెల్‌ను నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి కొనుగోళ్ల గురించి వాట్సప్ ద్వారా సంప్రదించాడు.
ఈ వార్తను కూడా చదవండి: IPL tickets: ఐపీఎల్ టికెట్లు పారదర్శకంగా విక్రయించాలి
డీల్‌ను వద్దని చెప్పినా, తిరస్కరించినా పట్టువదలకుండా ఫోన్ చేయడం ప్రారంభించాడు. వ్యక్తిగతంగా కలిసి మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని కోరాడు. దానికి ఆమె తిరస్కరించడంతో కక్ష పెంచుకున్న అతడు, నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా(Fake Instagram account) తెరిచి మహిళా వ్యాపారవేత్తకు అసభ్యకర సందేశాలు పెడుతున్నాడు. ఆమె యూట్యూబ్ చానెల్‌లోనూ అశ్లీల పోస్టులు పెట్టడం ప్రారంభించాడు.
వ్యాపారంపై ప్రభావం పడుతుందని భావించి బాధితురాలు వీటిని పట్టించుకోలేదు. అయినా వేధింపులు అధికం కావడంతో సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. అసభ్యకర సందేశాలు పంపుతూ, వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈవార్తను కూడా చదవండి: సిరిసిల్లలో ‘కేటీఆర్ టీ స్టాల్’ వివాదం
ఈవార్తను కూడా చదవండి: రోస్టర్ విధానంలో లోపాలు సరిచేయండి
ఈవార్తను కూడా చదవండి: ఊపందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
ఈవార్తను కూడా చదవండి: కులగణన రీ సర్వేలో కేటీఆర్ పాల్గొనాలి..
Read Latest Telangana News and National News
Updated Date - Feb 20 , 2025 | 08:08 AM