IPL tickets: ఐపీఎల్ టికెట్లు పారదర్శకంగా విక్రయించాలి
ABN , Publish Date - Feb 20 , 2025 | 07:39 AM
ఐపీఎల్ టికెట్లను(IPL tickets) పూర్తి పారదర్శకంగా విక్రయించాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్టు యాజమాన్యాన్ని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు ఆదేశించారు.
- హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు
హైదరాబాద్: ఐపీఎల్ టికెట్లను(IPL tickets) పూర్తి పారదర్శకంగా విక్రయించాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్టు యాజమాన్యాన్ని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు ఆదేశించారు. హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణపై బుధవారం ఉప్పల్ స్టేడియం(Uppal Stadium)లో ఎస్‌ఆర్‌హెచ్ జట్టు యాజమాన్యంతో సమన్వయ సమావేశం నిర్వహించారు. స్టేడియంలో తిను బంఢారాలు, శీతల పానీయాలను ఎక్కువ ధరలకు విక్రయించవద్దని సూచించారు.
ఈ వార్తను కూడా చదవండి: Mahashivratri: 25, 26 తేదీల్లో కీసరకు ప్రత్యేక బస్సులు

అలాగే ఐపీఎల్ తర్వాత హెచ్‌సీఏ(HCA) నిర్వహించనున్న టీపీఎల్‌కు సహకరించాలని ఎస్‌ఆర్‌హెచ్‌ను ఆయన కోరారు. రాష్ట్రంలో క్రికెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా ఎస్‌ఆర్‌హెచ్ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రెండు విషయాల్లోనూ తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం హామీ ఇచ్చింది. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు దల్జీత్ సింగ్, సహాయ కార్యదర్శి బసవరాజు తదితరులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: సిరిసిల్లలో ‘కేటీఆర్ టీ స్టాల్’ వివాదం
ఈవార్తను కూడా చదవండి: రోస్టర్ విధానంలో లోపాలు సరిచేయండి
ఈవార్తను కూడా చదవండి: ఊపందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
ఈవార్తను కూడా చదవండి: కులగణన రీ సర్వేలో కేటీఆర్ పాల్గొనాలి..
Read Latest Telangana News and National News