Cyber criminals: ఉద్యోగాల పేరుతో బురిడీ.. రూ.2లక్షలకు టోపీ
ABN, Publish Date - Feb 25 , 2025 | 07:56 AM
సింగపూర్, యూకే(Singapore, UK)లో ప్రముఖ కంపెనీలో ఉద్యోగం వచ్చిందని వీసా ప్రాసెసింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు(Cyber criminals) నగరానికి చెందిన యువకుడి నుంచి రూ. 2లక్షలు దోచేశారు.
- సైబర్ నేరగాళ్ల వలలో యువకుడు
హైదరాబాద్ సిటీ: సింగపూర్, యూకే(Singapore, UK)లో ప్రముఖ కంపెనీలో ఉద్యోగం వచ్చిందని వీసా ప్రాసెసింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు(Cyber criminals) నగరానికి చెందిన యువకుడి నుంచి రూ. 2లక్షలు దోచేశారు. వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన యువకుడు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. విదేశాల్లో మంచి ఉద్యోగం చేయాలని భావించి తన రెజ్యూమ్‌ను ఆన్‌లైన్ జాబ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేశాడు. కొద్దిరోజులకు సక్సెస్ పాయింట్ అబ్రాడ్ అనే ఏజెన్సీ నుంచి కాల్ వచ్చింది. ‘మీ రెజ్యూమ్‌ను పరిశీలించాం.
ఈ వార్తను కూడా చదవండి: మావోయిస్టు డీవీసీఎం పద్మ లొంగుబాటు
సింగపూర్‌లోని బ్లాక్ స్టోన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ్‌సలో ఆఫర్ వచ్చింది. ఫోన్‌లో ఇంటర్వ్యూకు అటెండ్ అయితే చాలు’ అంటూ తేదీ, సమయం చెప్పారు. ఇంటర్వ్యూ అనంతరం ‘మీరు బ్లాక్ స్టోన్ కంపెనీకి అకౌంటెంట్ ఉద్యోగానికి సెలక్ట్ అయ్యారు. జీతం, ఇతర వివరాలు మెయిల్ చేశాం. మీరు అక్కడకు వెళ్లడానికి వీసా ప్రాసెసింగ్ చేస్తున్నాం. అందుకు ప్రాసెసింగ్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. లక్ష జమ చేయాలి.
60 రోజుల్లోగా ప్రాసెస్ పూర్తికాకపోతే కంపెనీ రూల్స్ ప్రకారం మీ డబ్బులు 100 శాతం వాపస్ చేస్తాం’ అని నమ్మించారు. దాంతో బాధితుడు వారు చెప్పిన ఖాతాకు డబ్బులు డిపాజిట్ చేశాడు. ఆ తర్వాత కొద్దిరోజులకు ఫోన్ చేసిన నేరగాళ్లు ‘మీ ఉద్యోగం సింగపూర్ నుంచి యూకేకు మార్చారు. యూకేకు వీసా ప్రాసెసింగ్ చేయాలి. అందుకు సెక్యూరిటీ డిపాజిట్ రూ. లక్ష పంపాలి’ అని సూచించారు. మొదట డిపాజిట్ చేసిన డబ్బులు, త్వరలోనే మీ ఖాతాలో ఆటోమేటిక్‌గా జమ అవుతాయని నమ్మించడంతో బాధితుడు మరోసారి రూ.లక్ష వారి ఖాతాలో డబ్బులు జమ చేశాడు.
కొద్ది రోజులకు మళ్లీ ఫోన్ చేసిన నేరగాళ్లు ఐఈఎల్‌టీఎస్ (ఇంగ్లీష్ టెస్టు) సర్టిఫికెట్ ఉంటేనే వీసా ప్రాసెసింగ్ పూర్తవుతుందని, అదంతా మేనేజ్ చేయడానికి మరికొంత డబ్బు పంపాలని సూచించారు. అనుమానం వచ్చిన బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా వివరాలు సేకరించిన పోలీసులు ఇదంతా సైబర్ మోసమని నిర్ధారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: ఏఆర్ డెయిరీ ఎండీకి చుక్కెదురు
ఈవార్తను కూడా చదవండి: మేళ్లచెర్వులో మొదలైన జాతర సందడి
ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: బీఆర్‌ఎస్‌తో రేవంత్ కుమ్మక్కు
ఈవార్తను కూడా చదవండి: బాసరలో కిటకిటలాడుతున్న క్యూ లైన్లు, అక్షరాభ్యాస మండపాలు
Read Latest Telangana News and National News
Updated Date - Feb 25 , 2025 | 07:56 AM