ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bengaluru: సూట్‌కేసులో బాలిక మృతదేహం.. అర్ధరాత్రి ఇద్దరు పురుషులు నిర్మానుష్యమైన వీధిలో..

ABN, Publish Date - Jun 08 , 2025 | 05:56 PM

బెంగళూరులో బాలిక మృతదేహం లభించిన ఘటనలో తాజాగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు వ్యక్తులు బాలిక మృతదేహం ఉన్న బ్యాగుతో అర్ధరాత్రి వేళ వీధిలో వెళుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

Bengaluru suitcase murder

ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరు శివారులో బాలిక మృత దేహం లభించిన కేసులో తాజాగా కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు వ్యక్తులు సూట్‌కేసులో బాలిక మృతదేహాన్ని తరలిస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

చందాపురలోని రైల్వే ట్రాక్‌ పక్కన మే 21న బ్లూ స్టూట్‌కేసులో 17 ఏళ్ల బాలిక మృతదేహం లభించింది. అంతకుముందు, ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ సూట్‌‌కేసును తరలించినట్టు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. రాత్రి 11.51 గంటల సమయంలో ఓ నిర్మానుష్యమైన రోడ్డులో వారు సూట్‌కేసును మోసుకుంటూ వెళ్లారు. ఆ తరువాత వారిలో ఓ వ్యక్తి మరోసారి వెనక్కు వచ్చి సమీపంలోని చెట్టు వెనకాల వెతికినట్టు రికార్డయ్యింది. ఆ తరువాత వారు కాసేపు ఏదో చర్చించుకుని, మళ్లీ సూట్ కేసును తీసుకుని రైల్వే ట్రాక్‌ వైపు వెళ్లినట్టు మరో ఫుటేజీలో కనిపించింది.

కాగా, ఈ కేసుకు సంబంధించి సూర్యానగర్ పోలీసులు బీహార్‌కు చెందిన ఏడుగురిని అరెస్టు చేశారు. నిందితులు నవాడా జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఆషిక్ కుమారు అనే నిందితుడికి పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్టు వెల్లడించారు.

బాలికను మరొక ప్రాంతంలో హత్య చేసి సూట్‌కేసులో పెట్టి రైల్లోంచి పడేసి ఉంటారని తొలుత అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, మృతదేహం ఉన్న సూట్ కేసును క్యాబ్‌లో పెట్టుకుని రైల్వే ట్రాక్ వద్దకు తీసుకొచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

త్వరగా ఇంటికొచ్చిన భర్తకు షాక్.. భార్య మరొకరితో క్లోజ్‌గా ఉండటం చూసి..

భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..

Read Latest and Crime News

Updated Date - Jun 08 , 2025 | 06:05 PM