Unconsummated Marriage Compensation: శోభనం జరగలేదని భర్త నుంచి రూ.2 కోట్లు డిమాండ్
ABN, Publish Date - Sep 23 , 2025 | 08:01 PM
వైవాహిక జీవితంలో భర్త విఫలమయ్యాడంటూ ఓ మహిళ రూ.2 కోట్ల పరిహారం డిమాండ్ చేసింది. బెంగళూరులో ఈ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులో తాజాగా ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పెళ్లి తరువాత భర్త తనకు శారీరకంగా దగ్గర కాలేదంటూ ఓ యువతి రూ.2 కోట్లు పరిహారంగా డిమాండ్ చేసింది. ఈ క్రమంలో యువకుడు పోలీసులను ఆశ్రయించాడు (Bengaluru unconsummated marriage case).
జాతీయ మీడియా కథనాల ప్రకారం, చిక్కమంగళూరుకు చెందిన కేఎమ్ ప్రవీణ్‌కు మే 5న చందన అనే యువతితో వివాహం జరిగింది. అయితే, మే 16న ప్రవీణ్ మేనత్త ఇంట్లో ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. అప్పటికే శారీరక, మానసిక ఒత్తిడిలో ఉన్న ప్రవీణ్.. భార్యకు దగ్గర కాలేకపోయాడు. దీంతో, చందన మెడికల్ టెస్టులు చేయించుకోమని చెప్పింది. అయితే, ప్రవీణ్‌లో ఎటువంటి లోపం లేదని, అతడికి శారీరక, మానసిక ఒత్తిడి ఎక్కువైందని డాక్టర్లు చెప్పారు. మనసు స్థిమితపడే వరకూ రెస్టు తీసుకోవాలని సూచించారు (Wife demands huge compensation Bengaluru).
చందన ఇవేవీ పట్టించుకోకుండా నానా రచ్చ చేసిందని ప్రవీణ్ కుటుంబసభ్యులు ఆరోపించారు. జూన్ 7న పంచాయతీ ఏర్పాటు చేసి రూ.2 కోట్ల పరిహారం ఇవ్వాలంటూ వేధింపులకు దిగిందని అన్నారు. ఈ క్రమంలో ఆగస్టు 17న చందన, ఆమె కుటుంబసభ్యులు కొందరు ఇంట్లోకి వచ్చి తనపై దాడి చేశారని ప్రవీణ్, అతడి కుటుంబసభ్యులు ఆరోపించారు.
ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్య తనను అవమానించిందని, తన పరువును మంట కలిపిందని వాపోయాడు. ఆమె కుటుంబసభ్యులు తనపై బెదిరింపులకు దిగారని అన్నాడు. తన కుటుంబసభ్యులను కూడా బెదిరించారని అన్నారు. తనకు కొంత సమయం ఇవ్వాలని అడిగినా వారు వినిపించుకోలేదని వాపోయాడు. చందన కుటుంబసభ్యుల దాడిలో తాను గాయపడ్డానని కూడా చెప్పాడు. ఇందుకు సంబంధించి సీసీటీవీ, మెడికల్ రిపోర్టులను కూడా ఆధారాలుగా చూపించాడు. అందరి ముందూ తన పరువు తీసే ప్రయత్నం చేసిందని అన్నాడు. ఈ ఘటనపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి:
శోభనం కోసం ఒత్తిడి చేసిన భర్తను అంతమొందించిన భార్య
త్వరగా ఇంటికొచ్చిన భర్తకు షాక్.. భార్య మరొకరితో క్లోజ్‌గా ఉండటం చూసి..
Updated Date - Sep 23 , 2025 | 08:09 PM