Gold: రైలులో 13 తులాల బంగారు నగలు చోరీ
ABN, Publish Date - Feb 05 , 2025 | 10:00 AM
రైలు ప్రయాణికురాలి హ్యాండ్ బ్యాగులో ఉన్న 13 తులాల బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారు. కాచిగూడ రైల్వే పీఎస్ సీఐ ఎల్లప్ప తెలిపిన వివరాల ప్రకారం... గండిపేట హైదర్షాకోట్(Gandipet Hydershakot)లో నివాసం ఉంటున్న సంధ్యారాణి కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం రాత్రి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో కాచిగూడ(Kachiguda)కు బయలుదేరారు.
హైదరాబాద్: రైలు ప్రయాణికురాలి హ్యాండ్ బ్యాగులో ఉన్న 13 తులాల బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారు. కాచిగూడ రైల్వే పీఎస్ సీఐ ఎల్లప్ప తెలిపిన వివరాల ప్రకారం... గండిపేట హైదర్షాకోట్(Gandipet Hydershakot)లో నివాసం ఉంటున్న సంధ్యారాణి కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం రాత్రి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో కాచిగూడ(Kachiguda)కు బయలుదేరారు. రైలు షాద్‌నగర్ స్టేషన్(Shadnagar Station) వద్దకు వచ్చేసరికి 13 తులాల నగలతో ఉన్న ఆమె హ్యాండ్ బ్యాగు కని పించలేదు.
ఈ వార్తను కూడా చదవండి: HYDRA: చెరువుల్లో వ్యర్థాలు డంప్ చేస్తోన్న టిప్పర్లు సీజ్..
దాని కోసం గాలించగా బోగీలోని డస్ట్ బిన్ వద్ద కనిపించింది. అ యితే, బ్యాగ్‌లో నగలు లేవు. దొంగలు నగలను తీసుకొని ఖాళీ బ్యాగ్‌ను అక్కడ పడేసి పారిపోయారు. బాధితురాలు సంధ్యారాణి మంగళవారం కాచిగూడ రైల్వే పీఎస్(Kacheguda Railway PS)లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణ నిమిత్తం మహబూబ్‌నగర్ రైల్వే పీఎస్‌కు బదిలీ చేసినట్లు సీఐ తెలిపారు.
వార్తను కూడా చదవండి: ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల ఘాటు రిప్లై
ఈవార్తను కూడా చదవండి: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే..
ఈవార్తను కూడా చదవండి: చిక్కరు.. దొరకరు!
ఈవార్తను కూడా చదవండి: ఆయన బతికే ఉన్నారు.. మావోయిస్టుల సంచలన లేఖ
Read Latest Telangana News and National News
Updated Date - Feb 05 , 2025 | 10:00 AM