ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

USA: రష్యాతో బిజినెస్ చేస్తే భారత్‌పై 500 శాతం ట్యాక్స్ విధిస్తాం.. అమెరికా వార్నింగ్

ABN, Publish Date - Jul 02 , 2025 | 07:49 PM

రష్యాపై ఆమెరికా ఆర్థిక ఆంక్షలు విధించినప్పటికీ భారత్, చైనాలు పట్టించుకోలేదు. రష్యా నుంచి భారీ స్థాయిలో చమురును దిగుమతి చేసుకుంటున్నాయి. దీనిపై ఆమెరికా ఎప్పట్నుంచో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాజాగా రిపబ్లిక్ సెనెటర్ లిండ్సే గ్రాహం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత్, చైనాలను హెచ్చరించారు.

USA to impose 500% tariff on India

ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా (Russia)తో వ్యాపార బంధాన్ని కొనసాగిస్తే భారత్ (India), చైనా (China)లపై 500 శాతం సుంకాలను విధిస్తామని అమెరికా (USA) హెచ్చరించింది. రష్యాపై ఆమెరికా ఆర్థిక ఆంక్షలు విధించినప్పటికీ భారత్, చైనాలు పట్టించుకోలేదు. రష్యా నుంచి భారీ స్థాయిలో చమురును దిగుమతి చేసుకుంటున్నాయి. దీనిపై ఆమెరికా ఎప్పట్నుంచో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాజాగా రిపబ్లిక్ సెనెటర్ లిండ్సే గ్రాహం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత్, చైనాలను హెచ్చరించారు.

రష్యా నుంచి భారత్, చైనాలు 70 శాతం మేర చమురును దిగుమతి చేసుకుంటున్నాయని, ఆయా దేశాలపై 500 శాతం మేర సుంకాలు విధిస్తామని గ్రాహం పేర్కొన్నారు. యూఎస్ సెనెట్‌లో దీనిపై బిల్లు తీసుకొస్తామని, దీనికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఓకే చెప్పారని వెల్లడించారు. ఈ బిల్లు నిజంగానే అమల్లోకి వస్తే భారత్, రష్యాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. మన దేశం నుంచి అమెరికాకు ఔషధ, వస్త్ర ఉత్పత్తులు భారీగా ఎగుమతి అవుతుంటాయి. ఈ బిల్లు గనుక ఆమోదం పొందితే ఆయా రంగాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయి.

మరోవైపు భారత్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా ప్రతిపాదించిన డీల్‌ను భారత్ ఇంకా ఆమెదించలేదని, ఒకవేళ ఆమోదిస్తే ఇరు దేశాల ఉత్పత్తులపై చాలా తక్కువ పన్నులు మాత్రమే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. జులై 9 నాటికి ఈ డీల్‌ను పూర్తి చేయాలని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..

ఈపీఎఫ్ఓ నుంచి వచ్చిన 5 కీలక మార్పుల గురించి తెలుసా మీకు..

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 02 , 2025 | 07:49 PM