Trump threatens India: భారత్‌పై మరింతగా పన్నులు పెంచుతా.. డొనాల్డ్ ట్రంప్ మరోసారి బెదిరింపు..
ABN, Publish Date - Aug 05 , 2025 | 07:16 AM
డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. భారత్‌పై 25 శాతం పన్నులు పెంచుతున్నట్టు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ పన్నులతోనే ఆగనని మున్ముందు మరింతగా పెంచుతానని ట్రంప్ తాజాగా ప్రకటించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి భారత్‌పై తన ఆగ్రహాన్ని వెల్లడించారు. రష్యా నుంచి భారత్ చమురును కొనుగోలు చేస్తుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయమై అమెరికా హెచ్చరించినా భారత్ వెనక్కి తగ్గపోవడంతో ఆయన ఆగ్రహం మరింత పెరుగుతోంది (Trump threatens India). ఈ నేపథ్యంలో మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. భారత్‌పై 25 శాతం పన్నులు పెంచుతున్నట్టు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ పన్నులతోనే ఆగనని మున్ముందు మరింతగా పెంచుతానని ట్రంప్ తాజాగా ప్రకటించారు (US Tarrifs on India).
'రష్యా యుద్ధంలో ఎంత మంది ఉక్రెయిన్ పౌరులు చనిపోతున్నారో భారత్ పట్టించుకోవడం లేదు. రష్యా నుంచి ఆయిల్ కొంటూ ఆ దేశానికి నిధులు సమకూర్చడం ఆపడం లేదు. కాబట్టి భారత్‌పై మున్ముందు మరింతగా సుంకాలు పెంచుతాను' అని ట్రూత్ సామాజిక మాధ్యమం ద్వారా ట్రంప్ సోమవారం హెచ్చరించారు. అలాగే వలస వ్యవహారాల్లోనూ అమెరికాను భారత్ మోసం చేస్తోందని వైట్‌హౌస్ ఉన్నతాధికారి స్టీఫెన్ మిల్లర్ వ్యవహరించారు.
కాగా, రష్యా నుంచి చమురు కొనే విషయంలో అమెరికా అభ్యంతరాలను భారత్ గట్టిగా తిప్పికొట్టింది. దేశీయ ఇంధన అవసరాలను తీర్చుకోవడానికే రష్యా నుంచి భారత్ చమురు (Russia Oil) కొనుగోలు చేస్తోందని సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా ఇప్పటికీ రష్యా నుంచి యురేనియం హెక్సాఫ్లోరైడ్, విద్యుత్ వాహనాలు, ఎరువుల తయారీకి అవసరమైన పలేడియంను దిగుమతి చేసుకోవడాన్ని ప్రశ్నించింది.
ఇవి కూడా చదవండి
స్థిరంగా బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 05 , 2025 | 08:11 AM