ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Union Budget 2025-26: బడ్జెట్ 2025-26 ఫుల్ డీటెయిల్స్ మీకోసం..

ABN, Publish Date - Feb 01 , 2025 | 07:52 PM

Budget 2025-26 Full Details: ఈసారి మధ్యతరగతి, వేతన జీవులే లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొందించింది. రైతులు, వ్యాపారులకు ప్రోత్సాహకం అందిస్తూనే.. ట్యాక్స్ మినహాయింపులతో ఉద్యోగులకూ శుభవార్త చెప్పింది. బడ్జెట్-2025లో స్పెషాలిటీస్ ఏంటీ, సమగ్ర బడ్జెట్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Budget 2025-26

Budget 2025-26 Updates: బడ్జెట్.. ఈ మాట వినగానే రైతుల నుంచి వ్యాపారుల వరకు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఐటీ ఎంప్లాయీస్ దాకా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. పన్నుల విషయంలో ఏమైనా మార్పులు ఉంటాయా? ధరల మీద ఏమైనా తేలుస్తారా? అని వెయిట్ చేశారు. అయితే కేంద్రం అంచనాలను అందుకుందనే చెప్పాలి. ఈసారి మధ్యతరగతి, వేతన జీవులే లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొందించింది. రైతులు, వ్యాపారులకు ప్రోత్సాహకం అందిస్తూనే.. ట్యాక్స్ మినహాయింపులతో ఉద్యోగులకూ శుభవార్త చెప్పింది. 12 లక్షల లోపు ఆదాయం కలిగిన వారు రూపాయి చెల్లించాల్సిన పని లేకుండా చేసింది. ఈ నేపథ్యంలో బడ్జెట్-2025లో స్పెషాలిటీస్ ఏంటీ, సమగ్ర బడ్జెట్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..


ట్యాక్స్‌ పేయర్లకు భారీ ఊరట..

  • రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు.

  • నూతన శ్లాబ్‌ పరిధిలోకి రూ.12.75 లక్షల ఆదాయం దాటినవారు.

  • రూ.12 లక్షల ఆదాయం దాటిన వారికి కొత్త పన్ను శ్లాబ్స్‌.

  • రూ.0 నుంచి 4 లక్షల వరకు సున్నా.

  • రూ.4 - 8 లక్షల వరకు 5 శాతం పన్ను.

  • రూ.8 - 12 లక్షల వరకు 10 శాతం పన్ను.

  • రూ.12 - 16 లక్షల వరకు 15 శాతం పన్ను.

  • రూ.16 - 20 లక్షల వరకు 20 శాతం పన్ను.

  • రూ.20 - 24 లక్షల వరకు 25 శాతం పన్ను.

  • రూ.24 లక్షల పైన 30 శాతం పన్ను.


ఎంత లబ్ధి జరుగుతుంది..

  • రూ.8 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి రూ.30 వేల లబ్ధి.

  • రూ.9 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి రూ.40 వేల లబ్ధి.

  • రూ.10 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి రూ.50 వేల లబ్ధి.

  • రూ.11 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి రూ.65 వేల లబ్ధి.

  • రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి రూ.80 వేల లబ్ధి.

  • రూ.16 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి రూ.50 వేల లబ్ధి.

  • రూ.20 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి రూ.90 వేల లబ్ధి.

  • రూ.24 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి రూ.1.1 లక్షల లబ్ధి.

  • రూ.50 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి రూ.1.1 లక్షల లబ్ధి.


వార్షిక బడ్జెట్‌ ఇదే..

  • కేంద్ర వార్షిక బడ్జెట్‌ - రూ.50,65,345 కోట్లు.

  • రక్షణ శాఖ - రూ.4,91,732 కోట్లు.

  • గ్రామీణాభివృద్ధి - రూ.2,66,817 కోట్లు.

  • హోం శాఖ- రూ.2,33,211 కోట్లు.

  • వ్యవసాయ, అనుబంధ రంగాలు - రూ.1,71,437 కోట్లు.

  • విద్య - రూ.1,28,650 కోట్లు.

  • ఆరోగ్యం - రూ.98,311 కోట్లు.

  • పట్టణాభివృద్ధి - రూ.96,777 కోట్లు.

  • ఐటీ, టెలికం - రూ.95,298 కోట్లు.

  • విద్యుత్‌ - రూ.81,174 కోట్లు.

  • వాణిజ్యం, పరిశ్రమలు - రూ.65,553 కోట్లు.

  • సామాజిక సంక్షేమం - రూ.60,052 కోట్లు.

  • వైజ్ఞానిక విభాగాలు - రూ.55,679 కోట్లు.


కేంద్రానికి వచ్చే ఆదాయ మార్గాలు..

  • ఐటీ 22%.

  • ఎక్సైజ్‌ 5 శాతం.

  • GST ఇతర పన్నుల నుంచి 18%.

  • కార్పొరేషన్‌ పన్ను 17%.

  • కస్టమ్స్‌ నుంచి 4% ఆదాయం.

  • అప్పులతో కాని క్యాపిటల్‌ రిసీప్ట్స్‌ ద్వారా 1 శాతం ఆదాయం.

  • పన్నేతర 9%.

  • అప్పులు, ఇతర మార్గాల ద్వారా 24% ఆదాయం.


కేంద్ర ప్రభుత్వం ఖర్చుల వివరాలు..

  • వడ్డీ చెల్లింపులు 20%, కేంద్ర ప్రభుత్వ పథకాలకు 16% ఖర్చు.

  • కీలక సబ్సిడీలు 6%, రక్షణ రంగానికి 8% ఖర్చు.

  • రాష్ట్రాలకు పన్నులు, డ్యూటీల ద్వారా చెల్లింపులు 22 శాతం.

  • ఫైనాన్స్‌ కమిషన్‌, ఇతర బదిలీల ద్వారా 8 శాతం వ్యయం.

  • కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు 8 శాతం ఖర్చు.

  • ఇతర ఖర్చులు 8 శాతం, పెన్షన్లకు 4 శాతం వ్యయం.


కేంద్రం అప్పులు..

  • 2025-26 ఆర్థిక బడ్జెట్‌లో కేంద్రం అప్పులు రూ.196,78,772 లక్షల కోట్లుగా అంచనా.

  • 2024-25 బడ్జెట్‌ సవరించిన అంచనాల ప్రకారం.

  • రూ.181,74,284.36 లక్షల కోట్లుగా ప్రకటించిన కేంద్రం.

  • అంతర్గత అప్పులు, విదేశాల నుంచి తీసుకున్న అప్పులు కలిపి.

  • ఈ ఏడాది మార్చి నాటికి రూ.181,74,284.36 లక్షల కోట్లు.

  • ఈ ఏడాది మార్చి 31 నాటికి.. అంతర్గతంగా తీసుకున్న అప్పులు రూ.175,55,988.60 లక్షల కోట్లు.

  • 2026 నాటికి రూ.190,14,852.01 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా.

  • విదేశాల నుంచి తీసుకున్న అప్పులు.

  • ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.6,18,295.76 లక్షల కోట్లు.

  • 2026 నాటికి రూ.6,63,920.67 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా.

  • మొత్తంగా ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.181,74,284.36 లక్షల కోట్ల అప్పులు.

  • 2026 మార్చి 31 నాటికి రూ.190,14,852.01 లక్షల కోట్లకు చేరనున్న దేశ అప్పు.


150 కేంద్ర ప్రథకాలకు బడ్జెట్‌లో కీలక కేటాయింపులు..

  • గ్రామీణ ఉపాధి హామీకి రూ. 86 వేల కోట్లు.

  • పిఎం గ్రామసడక్‌ యోజనకు రూ. 19వేల కోట్లు.

  • జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌కు రూ. 19వేల కోట్లు.

  • వాటర్‌ షెడ్‌ అభివృద్ధికి రూ. 2,505 కోట్లు.

  • కృషి వికాస యోజనకు రూ. 8,500 కోట్లు.

  • ఆయుష్‌ మిషన్‌కు రూ. 1275 కోట్లు.

  • సమగ్ర శిక్షా యోజనకు రూ. 41,250 కోట్లు.

  • పోషన్‌ శక్తి కి రూ. 12,500 కోట్లు.

  • పిఎం స్కూల్‌ రైజింగ్‌కి రూ. 7500 కోట్లు.

  • ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి రూ. 30 వేల కోట్లు.

  • ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయలకు రూ. 7వేల కోట్లు.

  • ఆయుష్మాన్‌ భారత్‌కి రూ. 9600 కోట్లు.

  • పోలీసు ఆధునీకరణకు రూ. 4069 కోట్లు.

  • ప్రధాని ఆవాస యోజన (అర్బన్‌) రూ. 19,794 కోట్లు.

  • ప్రధాని ఆవాస యోజన (గ్రామీణ) రూ. 54,832 కోట్లు.

  • అమృత్‌కి రూ. 10వేల కోట్లు.

  • స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (అర్బన్‌) రూ. 5 వేల కోట్లు.

  • స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (గ్రామీణ) రూ. 7,192 కోట్లు.

  • అర్బన్‌ ఛాలంజ్‌ ఫండ్‌ రూ. 10వేల కోట్లు.

  • పిఎం కృషి సించాయి యోజన రూ. 8,260 కోట్లు.

  • నదుల అనుసంధానానికి రూ. 2,400 కోట్లు.

  • పోలవరం ప్రాజక్టుకు రూ. 5,936 కోట్లు.

  • జలజీవన్‌ మిషన్‌ (గ్రామీణ తాగునీటి) రూ. 67 వేల కోట్లు.

  • పన్ను మినహాయింపు ల కోసం రూ. 22,600 కోట్లు.

  • అంగన్‌వాడీ రూ. 21,960 కోట్లు.

  • పంటల భీమా రూ. 12,242 కోట్లు.

  • పిఎం ఆశా రూ. 6,941 కోట్లు.

  • పిఎం కిసాన్‌ రూ. 63,500 కోట్లు.

  • పత్తి టెక్నాలజీ మిషన్‌ రూ. 500 కోట్లు.

  • పప్పు ధాన్యాల మిషన్‌ రూ. వెయ్యి కోట్లు.

  • పండ్లు, కూరగాయల మిషన్‌ రూ. 500 కోట్లు.

  • హైబ్రిడ్‌ విత్తనాల మిషన్‌ రూ. 100 కోట్లు.

  • మఖనా బోర్డుకు రూ. 100 కోట్లు.

  • యూరియా సబ్సిడీ రూ. 1 లక్షా 18వేల 900 కోట్లు.

  • పోషకాహార సబ్సిడీ రూ. 49 వేల కోట్లు.

  • కొత్త పారిశ్రామిక పార్క్‌లకు రూ. 2500 కోట్లు.

  • టెలికం మౌలిక సదుపాయలకు రూ. 28,400 కోట్లు.

  • గరీబ్‌ కళ్యాణ్‌ యోజన రూ. 2 లక్షల 3 వేల కోట్లు.

  • రక్షణ పరిశోధనలకు రూ. 14,924 కోట్లు.

  • విమానాలు, ఏరో ఇంజన్లకు రూ. 48,614 కోట్లు.

  • రక్షణ నిర్మాణాలకు రూ. 11,452 కోట్లు.

  • నావెల్‌ ఫ్లీట్‌ రూ. 24,391 కోట్లు.

  • సెమీ కండక్టర్స్‌ వ్యవస్థ ఏర్పాటు రూ. 7వేల కోట్లు.

  • ఇండియా ఎఐ మిషన్‌ రూ. 2వేల కోట్లు.

  • మెట్రో ప్రాజక్టులు రూ. 31,239 కోట్లు.

  • పోలీసు మౌలిక వసతులకు రూ. 4,379 కోట్లు.

  • కొత్త ఉద్యోగాల సృష్టికి రూ. 20 వేల కోట్లు.

  • కుసుం రూ. 2,600 కోట్లు.

  • సూర్య ఘర్‌ రూ. 20 వేల కోట్లు.

  • పేదలకు ఎల్‌పిజి కనక్షన్లకు రూ. 9,100 కోట్లు.

  • కొత్త రైల్వే లైన్లకు రూ. 32,235 కోట్లు.

  • డబ్లింగ్‌కి రూ. 32 వేల కోట్లు.

  • రోలింగ్‌ స్టాక్‌ రూ. 45,530 కోట్లు.

  • జాతీయ రహదారులకు రూ. 1లక్షా 70వేల 266 కోట్లు.

  • మంత్రిత్వ శాఖ ద్వారా రహదారులకు రూ. 1లక్షా 16 వేల 292 కోట్లు.

  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో పరిశోధనలకు రూ. 20 వేల కోట్లు.

  • ఏకలవ్య మోడల్‌ స్కూల్స్‌ రూ. 7,089 కోట్లు.

  • ఖేలో ఇండియా రూ. వెయ్యి కోట్లు.

Updated Date - Feb 01 , 2025 | 07:52 PM