ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Quarterly Profit: యూకో బ్యాంక్‌ లాభం రూ.607 కోట్లు

ABN, Publish Date - Jul 22 , 2025 | 04:46 AM

ప్రభుత్వ రంగంలోని యూకో బ్యాంక్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.607 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన...

కోల్‌కతా: ప్రభుత్వ రంగంలోని యూకో బ్యాంక్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.607 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ.551 కోట్లతో పోల్చితే లాభం 10.16ు పెరిగింది. బలమైన రుణ వృద్ధితో పాటు ఆస్తుల నాణ్యత మెరుగుపడడం ఇందుకు దోహదపడినట్టు బ్యాంక్‌ తెలిపింది. ఇటు వడ్డీ ఆదాయం, అటు వడ్డీయేతర ఆదాయం కూడా పెరిగాయని బ్యాంక్‌ ఎండీ, సీఈఓ అశ్వినీ కుమార్‌ తెలిపారు. రుణాలపై ఆర్జించిన వడ్డీ ఆదాయమే రూ.6,000 కోట్ల నుంచి రూ.6,400 కోట్లకు పెరిగిందన్నారు. దీనికి తోడు నిర్వహణా వ్యయా లు 4ు మాత్రమే పెరగడం లాభదాయకత పెరుగుదలకు దోహదపడిందని తెలిపారు. అయితే రుణాలపై వడ్డీ సవరణ ముందస్తుగానే ప్రకటించిన కారణంగా నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) గతంలో అంచనా వేసిన 3-3.10ు నుంచి 2.9-3 శాతానికి తగ్గవచ్చని ఆయన చెప్పారు. జూన్‌ త్రైమాసికంలో ఎన్‌ఐఎం 2.96 శాతంగా ఉన్నట్టు తెలిపారు. జూన్‌ 30 నాటికి బ్యాంక్‌ మొత్తం వ్యాపారం 13.51ు వృద్ధితో రూ.5,23,736 కోట్లకు పెరగగా, రుణాలు 16.48ు వృద్ధితో రూ.2,25,101 కోట్లకు, డిపాజిట్లు 11.37ు వృద్ధితో రూ.2,98,635 కోట్లకు చేరాయని పేర్కొంది. ఈ కాలంలో స్థూల మొండి బకాయిలు (ఎన్‌పీఏ) 3.32ు నుంచి 2.63 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు కూడా 0.78ు నుంచి 0.45 శాతానికి తగ్గాయి.

ఇవి కూడా చదవండి

ఈ వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 22 , 2025 | 04:46 AM