Business Ideas: మీ దగ్గర రూ.1000 లు ఉంటే చాలు.. ఈ వ్యాపారంలో నెలకు మినిమం రూ.30 వేల ప్రాఫిట్..
ABN, Publish Date - Mar 11 , 2025 | 02:15 PM
Business Ideas: ఒకరికింద పనిచేయడం కంటే సొంతంగా వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలని కోరుకుంటున్నారు నేటితరం. ఉద్యోగం ద్వారా కంటే బిజినెస్ వల్లే త్వరగా సంపాదించగలిగే సౌలభ్యం ఉండటమూ మరో కారణం. తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసి ఎక్కువ ప్రాఫిట్ వచ్చే మార్గం కోసం మీరు వెతుకుతుంటే ఈ బిజినెస్ ఐడియా మీకోసమే..
Low Investment Business Ideas: ఉద్యోగం కోసం సొంతూరు వదిలి ఎక్కడెక్కడికో వెళ్లి ఒత్తిడితో పనిచేయడం కంటే ఏదైనా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయడం మేలని ఆలోచించే వారి సంఖ్య పెరుగుతోంది. కుటుంబానికి రోజూ తగిన సమయం కేటాయించుకుంటూనే.. ఒత్తిడి లేకుండా నిలకడైన ఆదాయ మార్గం కోసం మీరు అన్వేషిస్తుంటే ఈ బిజినెస్ చేయండి. ఇంటి దగ్గరే ఉంటూనే ఆదాయం పొందాలనుకునేవారికే కాదు.. మీ జాబ్ వదులుకోకుండా పార్ట్ టైంగా కూడా ఈ వ్యాపారం చేసుకోవచ్చు. పెట్టుబడి ఖర్చు కేవలం వెయ్యి రూపాయలు. ఇంత తక్కువ మొత్తంలో చేయగలిగే బిజినెస్ ఈ కాలంలో ఇదొక్కటే తెలుసా.. ఆల్ టైం డిమాండ్ ఉన్న ఈ బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి పూర్తి వివరాలు మీకోసం..
పని, పెట్టుబడి రెండూ తక్కువే..
బిజినెస్ చేయాలనే కోరిక చాలా మంది మనసులోనే అణిచేసుకోవడానికి గల ప్రధాన కారణం పెట్టుబడి సమకూర్చుకోలేమనే భయం. తీరా అప్పో సప్పో చేసి తెచ్చినా వ్యాపారంలో నష్టమొస్తే అనే సందేహం. అందుకే ఈ రెండు భయాలు లేకుండా మీరు ఈ ఫుడ్ బిజినెస్ చేసుకోవచ్చు. వామ్మో ఫుడ్ బిజినెస్ అంటే పనిచేసేందుకు.. పెట్టుబడికి చాలా కావాలి అనే డౌట్ మీకు రావచ్చు. అదేం లేదు. ఈ వ్యాపారం చేయడానికి ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు మనుషులు ఉన్నా చాలు. అదీ కనీసం రోజుకో 3 గంటలు కేటాయిస్తే ప్రతి నెలా మినిమం రూ.30వేల ప్రాఫిట్ వస్తుంది. అదే ఆలూ చిప్స్ వ్యాపారం.
పెట్టుబడి ఖర్చు: రూ.1000-రూ.3000
ప్యాకెట్ ఉత్పత్తి ఖర్చు: రూ.10 - రూ.20
ప్యాకెట్ అమ్మకపు ధర: రూ.20 - రూ.50
ప్యాకెట్‌కు లాభం: రూ.10 - రూ.30
Read Also : Business Idea : పెట్టుబడి పదివేలు.. రాబడి రూ.50వేలు.. మహిళలు ఇంటి
Business Ideas: రోజులో రెండు గంటలు ఈ పనిచేస్తే చాలు.. మహిళలకు ఇంటి
Business Plan : డబ్బుకు డబ్బు.. ఇంట్లోనే పని.. మహిళల కోసం బెస్ట్ ...
మరిన్ని బిజినెస్, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Mar 11 , 2025 | 02:23 PM