Share News

Business Idea : పెట్టుబడి పదివేలు.. రాబడి రూ.50వేలు.. మహిళలు ఇంటి చేయగలిగే బెస్ట్ బిజినెస్ ఐడియా..

ABN , Publish Date - Mar 09 , 2025 | 11:59 AM

Business Ideas For Women : అడుగు బయటపెట్టకుండా ఇంటి నుంచే డబ్బు సంపాదించే అవకాశం కోసం వెతుకుతున్నారా. ఇలా ఆలోచించే మహిళల కోసమే ఈ చక్కటి బిజినెస్ ఐడియాస్. కేవలం మీరు రూ.10వేల పెట్టుబడితో నాలుగింతల లాభం పొందగలిగే వ్యాపార ఆలోచనలు మీకోసం..

Business Idea : పెట్టుబడి పదివేలు.. రాబడి రూ.50వేలు.. మహిళలు ఇంటి చేయగలిగే బెస్ట్ బిజినెస్ ఐడియా..
Top Business Ideas for Women from Home

Small Investment Business Ideas For Women : ఈ రోజుల్లో ఇంట్లో నుంచే పని చేసి ఆదాయం సంపాదించాలని అనుకునే మహిళల సంఖ్య పెరుగుతోంది. అయితే, ఏ పని చేయాలి? ఎక్కడి నుంచి ప్రారంభించాలి? ఎంత పెట్టుబడి అవసరం? అనే సందేహాలు చాలా మందికి ఉంటాయి. అయితే, తక్కువ పెట్టుబడితోనే ఇంట్లో నుంచి సులభంగా ప్రారంభించగల వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చెప్పబోయే రెండు బిజినెస్ ఐడియాలు మహిళలు ఎక్కడైనా, ఇంట్లో నుంచే సులభంగా ప్రారంభించవచ్చు.


బ్యూటీ-పార్లర్

beauty-parlour.jpgబ్యూటీ పార్లర్ సేవలకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. మహిళలు అందంగా ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మేకప్, ఫేషియల్, హెయిర్ కటింగ్, మెహందీ డిజైన్, పెడిక్యూర్, మేనిక్యూర్ వంటి సేవలను అందించడానికి ఇంట్లోనే చిన్న స్థాయిలో పార్లర్ ప్రారంభించవచ్చు. ప్రాథమికంగా బ్యూటీ థెరపీ మీద ఓ చిన్న కోర్సు చేస్తే ఇంకా నైపుణ్యం పెరుగుతుంది. ప్రారంభ దశలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, పొరుగు వారితో ట్రై చేసి, వారి అభిప్రాయాలను తెలుసుకోవాలి. నెమ్మదిగా మంచి నైపుణ్యం సంపాదించుకొని, కస్టమర్లను పెంచుకుంటూ వెళ్లాలి. మీ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటివాటిని ఉపయోగించుకోవచ్చు. ఈ బిజినెస్ ప్రారంభించడానికి చాలా తక్కువ పెట్టుబడితో సరిపోతుంది. ప్రాథమికంగా రూ.10,000 నుంచి రూ.20,000 పెట్టుబడి ఉంటే చాలనే చెప్పవచ్చు. మంచి ప్రమోషన్ చేస్తూ కస్టమర్ల నమ్మకాన్ని పొందితే.. నెలకు కనీసం 30,000 నుంచి 1 లక్ష రూపాయల వరకూ సంపాదించగలరు.


జ్యూవెలరీ-బిజినెస్

jewellery.jpgఇప్పుడు హ్యాండ్‌మేడ్ జ్యూవెలరీకి విపరీతమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా యువత, మహిళలు యూనిక్ డిజైన్లు కలిగిన చెవిపోగులు, గాజులు, నెక్‌లెస్‌లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ బిజినెస్ మొదలు పెట్టడానికి పెద్ద స్కిల్స్ అవసరం లేదు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటివాటిలో వీటిని తయారు చేసే పద్ధతులు నేర్చుకోవచ్చు. మొదట తక్కువ పెట్టుబడితో మెటీరియల్స్ కొనుగోలు చేసి చిన్నగా ప్రారంభించాలి. కొద్దిగా ప్రాక్టీస్ చేసి మంచి డిజైన్లు సృష్టిస్తే, వాటిని ఇంట్లో నుంచే అమ్ముకోవచ్చు. మీరు వాట్సాప్ బిజినెస్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా కస్టమర్లను సంప్రదించవచ్చు. అంతే కాకుండా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలలో కూడా మీ ఉత్పత్తులను లిస్టింగ్ చేయవచ్చు. ఈ వ్యాపారం కోసం కేవలం రూ.5000 నుంచి రూ.10000 పెట్టుబడితో మొదలుపెట్టొచ్చని చెప్పవచ్చు. ఒకసారి మంచి కస్టమర్ బేస్ ఏర్పడిన తర్వాత నెలకు రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.


Read Also : Business Ideas: రోజులో రెండు గంటలు ఈ పనిచేస్తే చాలు.. మహిళలకు ఇంటి ..

Business Plan : డబ్బుకు డబ్బు.. ఇంట్లోనే పని.. మహిళల కోసం బెస్ట్ ...

Business Ideas: పీఎం మోడీ చెప్పిన ఈ పంటకు పెట్టుబడి రూ.20వేలు ...

Updated Date - Mar 09 , 2025 | 12:04 PM