Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. ఈ రోజు ధరలు ఎంతంటే..
ABN, Publish Date - Apr 20 , 2025 | 06:34 AM
Gold Rates: నిన్న హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 97,580 దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 89,450 దగ్గర ట్రేడ్ అయింది..10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర .. 73,190 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.
ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయి. పెట్టుబడి పెట్టాలనుకునే వారు బంగారం వైపే మొగ్గుచూపుతున్నారు. ధరలు రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. బంగారం కొనాలనుకునే వాళ్లకు కంట్లో నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పేద, మధ్య తరగతి కుటుంబాలు బంగారం కొనడం అసాధ్యమే. స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర లక్ష దగ్గరగా ఉంది. 22 క్యారెట్ల బంగారం 90 దగ్గర ట్రేడ్ అవుతోంది. త్వరలో అక్షమ తృతీయ ఉండటంతో జనం బంగారం కోసం షాపుల దగ్గర బారులు తీరతారు. ఈ నేపథ్యంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
హైదరాబాద్ నగరంలో ధరలు ఇలా..
గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ తెలిపిన వివరాల ప్రకారం.. నిన్న హైదరాబాద్ మహా నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 97,580 దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 89,450 దగ్గర ట్రేడ్ అయింది.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర .. 73,190 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఒక రూపాయి పెరగలేదు. ఒక రూపాయి తగ్గలేదు. బంగారం కొనాలనుకునే వారికి ఇది శుభవార్తే అని చెప్పాలి. దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం బంగారం ధరలు అధికంగా ఉంటున్నాయి. గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర 8960 దగ్గర ట్రేడ్ అవుతోంది. గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర 9758 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఒక గ్రాము 18 క్యారెట్ల బంగారం ధర 7331 దగ్గర ట్రేడ్ అవుతోంది.
వెండి ధరలు ఇలా..
బంగారం ధరలలాగే వెండి ధరలు కూడా నిన్నటితో సమానంగానే ఉన్నాయి. పెరగలేదు, తగ్గలేదు. నిన్న ఒక గ్రాము వెండి ధర 100 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల వెండి ధర 1000 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. కేజీ బంగారం ధర లక్ష దగ్గర ట్రేడ్ అయింది. మొన్న మాత్రం గ్రాము వెండిపై 10 పైసలు తగ్గింది. వెండి కూడా స్థిరమైన పెరుగుదల కనబరుస్తోంది.
ఇవి కూడా చదవండి
AP High Court: అభ్యర్థుల వయోపరిమితి పెంచాలని ఆదేశించలేం
Gurukula JEE Success: Vసత్తా చాటిన గురుకుల విద్యార్థులు
Updated Date - Apr 20 , 2025 | 06:44 AM