ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

క్రెడిట్‌ కార్డుతో నగదు తీసుకుంటున్నారా

ABN, Publish Date - May 25 , 2025 | 04:41 AM

ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవసరం వస్తుందో తెలియదు. ఆ సమయంలో చేతిలో డబ్బులు ఉంటాయనే గ్యారెంటీ లేదు. అప్పుడు బంధుమిత్రుల నుంచి లేదా బ్యాంకు నుంచి అప్పు చేయక తప్పదు. ఇవేవీ సాధ్యం కాకపోతే క్రెడిట్‌ కార్డు ద్వారా...

జాగ్రత్తలు తీసుకోకపోతే గుదిబండగా మారే ప్రమాదం

ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవసరం వస్తుందో తెలియదు. ఆ సమయంలో చేతిలో డబ్బులు ఉంటాయనే గ్యారెంటీ లేదు. అప్పుడు బంధుమిత్రుల నుంచి లేదా బ్యాంకు నుంచి అప్పు చేయక తప్పదు. ఇవేవీ సాధ్యం కాకపోతే క్రెడిట్‌ కార్డు ద్వారా నగదు విత్‌డ్రా చేయడం ఒక్కటే మార్గం. అయితే ఇది అంత క్షేమం కాదు. ఇందుకు అధిక వడ్డీతో పాటు చార్జీల రూపంలోనూ భారీగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో క్రెడిట్‌ కార్డు ద్వారా అడ్వాన్స్‌ నగదు విత్‌డ్రాయల్స్‌లో ఉన్న సమస్యలు ఏమిటో తెలుసుకుందాం...

చార్జీలు

క్రెడిట్‌ కార్డు అంటేనే ఫీజులు, వడ్డీలు. ఇక ఈ కార్డులతో విత్‌డ్రా చేసే అడ్వాన్స్‌ నగదుపై వడ్డీ భారం మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రతి నగదు విత్‌డ్రాయల్స్‌పై కనీసం రూ.250 నుంచి రూ.500 చొప్పున ఫీజు చెల్లించాలి. విత్‌డ్రా చేసే నగదును బట్టి ప్రతి లావాదేవీ విలువలో ఇది 2.5 శాతం నుంచి 3 ఽశాతం వరకు ఉంటుంది. క్రెడిట్‌ కార్డు కంపెనీలు జారీ చేసే బిల్లింగ్‌ స్టేట్‌మెంట్‌లో ఈ చార్జీల వివరాలు ఉంటాయి.


వడ్డీ రేటు

క్రెడిట్‌ కార్డుల ద్వారా విత్‌డ్రా చేసే నగదు అడ్వాన్స్‌పై బ్యాంకులు నెలవారీ పద్దతిలో వడ్డీ రేటు వసూలు చేస్తాయి. సాధారణంగా ఈ వడ్డీ రేటు 2.5 నుంచి 3 శాతం మధ్య ఉంటుంది.

లేటు చెల్లింపులు వద్దు

ఈ చెల్లింపులను ఒకేసారి వీలైనంత త్వరగా చెల్లించడం మంచిది. చేతిలో డబ్బులు లేవని కొద్దికొద్ది గా ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో చెల్లిస్తే ఫీజుల భారం తడిసి మోపెడవుతుంది. సాధారణంగా ఇది మిగిలిన బకాయి మొత్తంలో 15 నుంచి 30 శాతం వరకు ఉంటుంది. ఆలస్యంగా చేసే అడ్వాన్స్‌ నగదు చెల్లింపులు ఆర్థిక భారంతో పాటు క్రెడిట్‌ స్కోరునూ దెబ్బతీస్తాయి.


తొలి రోజు నుంచే వడ్డీ

క్రెడిట్‌ కార్డుపై కొనే వస్తువుల ఽబకాయిలు చెల్లించేందుకు కొంత ఇంటరెస్ట్‌ ఫ్రీ గడువు ఉంటుంది. అడ్వాన్స్‌ నగదు విత్‌డ్రాయల్స్‌కు ఇలాంటి సౌలభ్యం ఉండదు. నగదు విత్‌డ్రా చేసిన రోజు నుంచి చెల్లించే రోజు వరకు వడ్డీ భారం తప్ప దు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ అడ్వాన్స్‌ నగదు విత్‌డ్రాయల్స్‌ను ఎంత త్వరగా చెల్లిస్తే అంత మంచిది.

పరిమితులు

క్రెడిట్‌ కార్డు చేతిలో ఉన్నంత మాత్రాన ఎంత పడితే అంత అడ్వాన్స్‌ నగదు విత్‌డ్రాయల్స్‌ కుదరవు. మీ క్రెడిట్‌ కార్డు క్రెడిట్‌ లిమిట్‌లో ఒక పరిమితికి లోబడి మాత్రమే ఈ నగదు ఉపసంహరణ సాధ్యం. ఒకవేళ దీన్ని ఉపయోగించుకున్నా ఆ మొత్తాన్ని నిర్ణీత గడువులోగా ఒకేసారి చెల్లించాలి. లేకపోతే అది గుదిబండగా మారే ప్రమాదం ఉంది.

ఇవీ చదవండి:

వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్‌లో ఐఫోన్‌లు తయారు చేస్తే..

పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్రను భగ్నం చేసిన భారత్..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 25 , 2025 | 04:41 AM