ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

టెలికంలో ద్వంద్వ పెత్తనం మంచిది కాదు

ABN, Publish Date - Jun 25 , 2025 | 02:00 AM

టెలికం రంగంలో రెండు కంపెనీల గుత్తాధిపత్యం ఏమాత్రం మంచిది కాదని కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. ఏ రంగంలో అయినా పోటీ తప్పనిసరన్నారు...

  • టెలికం మంత్రి సింధియా

న్యూఢిల్లీ: టెలికం రంగంలో రెండు కంపెనీల గుత్తాధిపత్యం ఏమాత్రం మంచిది కాదని కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. ఏ రంగంలో అయినా పోటీ తప్పనిసరన్నారు. బ్రాడ్‌బ్యాండ్‌ ఇండియా ఫోరం (బీఐఎఫ్‌) నిర్వహించిన ఒక సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశ టెలికం రంగంలో రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌ కంపెనీలదే పెత్తనం. ఈ రెండు కంపెనీలు 4జీ, 5జీ సేవలతో దూసుకు పోతుంటే, వొడాఫోన్‌ ఐడియా కంపెనీ అప్పులు, నష్టాలతో కుదేలవుతోంది. ప్రభుత్వ రంగంలోని బీఎ్‌సఎన్‌ఎల్‌ అయితే ఇప్పటి వరకు కనీసం 4జీ సేవలు కూడా ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

శాట్‌కామ్‌లకు త్వరలో స్పెక్టమ్‌: ఉపగ్రహ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించే కంపెనీలకు త్వరలోనే స్పెక్ట్రమ్‌ కేటాయింపులు పూర్తి చేస్తామని సింధియా ప్రకటించారు. అయితే ఎప్పటిలోగా అనే విషయాన్ని మాత్రం వెల్లడించ లేదు. వేలం ద్వారా గాక, పాలనాపరమైన అనుమతుల ద్వారానే ఈ కేటాయింపులు ఉంటాయన్నారు. ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని స్టార్‌లింక్‌తో పాటు అనేక శాట్‌కాం కంపెనీలు ఇప్పటికే లైసెన్సులు పొంది తమ సేవల ప్రారంభానికి స్పెక్ట్రమ్‌ కేటాయింపుల కోసం ఎదురు చూస్తున్నాయి.

ఇవీ చదవండి:

హార్ముజ్ జలసంధి మూసివేస్తే.. భారత్‌ తట్టుకోగలదా

మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్.. వేలల్లో తొలగింపులు ఉంటాయంటూ కథనాలు వైరల్

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 25 , 2025 | 02:00 AM