టీసీఎస్ లో సీనియర్ ఉద్యోగులకు వేరియబుల్ చెల్లింపుల్లో కోత!
ABN, Publish Date - May 07 , 2025 | 05:33 AM
దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ తన సీనియర్ ఉద్యోగులకు జనవరి-మార్చి త్రైమాసికానికి చెల్లించాల్సిన ‘వేరియబుల్ పే’లో కోత విధించింది. వీరికి వేరియబుల్ పే తగ్గించడం వరుసగా ఇది...
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ తన సీనియర్ ఉద్యోగులకు జనవరి-మార్చి త్రైమాసికానికి చెల్లించాల్సిన ‘వేరియబుల్ పే’లో కోత విధించింది. వీరికి వేరియబుల్ పే తగ్గించడం వరుసగా ఇది మూడో త్రైమాసికమని ఓ ఆంగ్ల మీడియా కథనం పేర్కొంది. టీసీఎస్ సీనియర్ ఉద్యోగుల సీటీసీ (కాస్ట్ టు కంపెనీ)లో వేరియబుల్ పే 15-20 శాతంగా ఉంది. కాగా, టీసీఎస్ దీన్ని తోసిపుచ్చింది. కాగా ఈ మార్చి త్రైమాసికంలో 70 శాతానికి పైగా ఉద్యోగులకు 100 శాతం వేరియబుల్ పే చెల్లించినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఉద్యోగి విధులు నిర్వహిస్తున్న బిజినెస్ యూనిట్ పనితీరు ఆధారంగా ఈ చెల్లింపులను నిర్ణయించడం జరుగుతుందని కంపెనీ స్పష్టం చేసింది. ప్రస్తుతం టీసీఎ్‌సలో 6 లక్షలకు పైగా ఉద్యోగులున్నారు.
ఇవి కూడా చదవండి:
Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం
ATM Cash Withdrawal: ఈ ప్రాంతాల్లో భారీగా నగదు వాడకం..ప్రతి ఏటీఎం నుంచి రూ.1.3 కోట్లు విత్ డ్రా..
Read More Business News and Latest Telugu News
Updated Date - May 07 , 2025 | 05:34 AM