Taj GVK: తాజ్ జీవీకే లాభం రూ.36 కోట్లు
ABN, Publish Date - Aug 09 , 2025 | 03:26 AM
జూన్ త్రైమాసికంలో తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్ నికర లాభం దాదాపు మూడింతలై
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి బిజినెస్): జూన్ త్రైమాసికంలో తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్ నికర లాభం దాదాపు మూడింతలై రూ.36.22 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి కంపెనీ లాభం రూ.12.71 కోట్లుగా ఉంది. కాగా, ఆదాయం రూ.94.70 కోట్ల నుంచి రూ.128.29 కోట్లకు ఎగబాకింది. తమ సంస్థకిది అత్యుత్తమ తొలి త్రైమాసికమని తాజ్ జీవీకే చైర్మన్ జీవీకే రెడ్డి అన్నారు.
Updated Date - Aug 09 , 2025 | 03:26 AM