ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Canara Bank Q1 Results: కెనరా బ్యాంక్‌ లాభం రూ 4752 కోట్లు

ABN, Publish Date - Jul 25 , 2025 | 02:46 AM

ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన రూ.38,063 కోట్ల ఆదాయంపై...

క్యూ1లో 22% వృద్ధి

ఈ త్రైమాసికంలోనే కెనరా రొబెకో ఏఎంసీ లిస్టింగ్‌

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన రూ.38,063 కోట్ల ఆదాయంపై రూ.4,752 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే సమయంలో ఆర్జించిన ఆదాయం రూ.34,020 కోట్లు కాగా లాభం రూ.3,905 కోట్లుగా ఉంది. వార్షిక ప్రాతిపదికన క్యూ1లో లాభం 22ు పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో బ్యాంకు ఆర్జించిన వడ్డీ ఆదాయం రూ.28,701 కోట్ల నుంచి రూ.31,003 కోట్లకు పెరిగింది. అయితే నికర వడ్డీ ఆదాయం మాత్రం 2 శాతం క్షీణించి రూ.9,166 కోట్ల నుంచి రూ.9,009 కోట్లకు తగ్గింది. నికర వడ్డీ మార్జిన్‌ 2.55 శాతం నుంచి 2.9 శాతానికి పెరిగిందని కెనరా బ్యాంక్‌ ఎండీ, సీఈఓ కే.సత్యనారాయణ రాజు తెలిపారు. కాగా రెగ్యులేటరీ అనుమతులకు లోబడి ప్రస్తుత త్రైమాసికంలోనే తమ అనుబంధ కంపెనీల్లో ఒకటైన కెనరా రొబెకో అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఏఎంసీ) లిస్టింగ్‌ చేయనున్నట్లు ఆయన చెప్పారు. మరో కంపెనీ కెనరా హెచ్‌ఎ్‌సబీసీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ను వచ్చే త్రైమాసికంలో లిస్టింగ్‌ చేస్తామని ఆయన వెల్లడించారు. సమీక్షా కాలంలో బ్యాంక్‌ నిర్వహణాపరమైన లాభం రూ.7,616 కోట్ల నుంచి రూ.8,554 కోట్లకు పెరిగింది.

తగ్గిన ఎన్‌పీఏలు: కాగా జూన్‌ త్రైమాసికంలో బ్యాంక్‌ స్థూల మొండి బకాయిలు (ఎన్‌పీఏ) 4.14% నుంచి 2.69 శాతానికి, నికర ఎన్‌పీఏలు 1.24% నుంచి 0.63 శాతానికి తగ్గాయి. బ్యాంక్‌ మంజూరు చేసిన స్థూల రుణాలు 12ు వృద్ధితో రూ.10,96,329 కోట్లకు చేరాయి. ఎన్‌పీఏలు తగ్గిన కారణంగా మొండి బకాయిల కోసం కేటాయింపులు రూ.2,171 కోట్ల నుంచి రూ.1,845 కోట్లకు తగ్గాయి. ఈ ఏడాది జూన్‌ నాటికి ఆస్తులపై రాబడి 1.14% ఉంది. బ్యాంక్‌ సీఏఆర్‌ 16.38% నుంచి 16.52 శాతానికి చేరింది. బ్యాంక్‌ ప్రపంచ వ్యాపారం 10.98% పెరిగి రూ.25,63,984 కోట్లకు చేరగా ప్రపంచ డిపాజిట్లు 9.92% వృద్ధితో రూ.14,67,655 కోట్లకు చేరాయి.

ఇవీ చదవండి:

సంపన్నులు తమ ఆస్తులను ఎలా పెంచుకుంటారో తెలుసా.. సీఏ చెప్పిన ఈ సూత్రం తెలిస్తే..

వేతన జీవులకు అక్కరకొచ్చే 50-30-20 ఫార్ములా

Read Latest and Business News

Updated Date - Jul 25 , 2025 | 02:46 AM