ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Markets Friday Closing: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

ABN, Publish Date - Apr 25 , 2025 | 04:49 PM

వరుసగా ఎనిమిది రోజుల పాటు బుల్ ర్యాలీ కొనసాగడం.. భారీ స్థాయిలో ఇండెక్సులు పెరగడం.. దీనికి తోడు పాకిస్థాన్ తో యుద్ధవాతావరణం నడుమ, మన స్టాక్ మార్కెట్లు శుక్రవారం..

Stock Market indices

Stock Market Friday Closing: భారత స్టాక్ మార్కెట్ సూచీలు వారాంతం(శుక్రవారం) రెడ్ లో ముగిశాయి. మార్కెట్లు నష్టాలతో ముగియడం వరుసగా ఇది రెండోరోజు. నేడు నిఫ్టీ 207.35 పాయింట్లు నష్టపోగా, సెన్సెక్స్ 588.90 పాయింట్లు పతనమైంది. అయితే, ఇవాళ ఐటీ స్టాక్స్ మెరుగ్గా రాణించడం విశేషం. ఐటీ మినహా, మిగతా అన్ని రంగాలలో.. మీడియా, మెటల్, పీఎస్ యూ, టెలికాం, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, రియాల్టీ 2 నుంచి 3 శాతం క్షీణించాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 2.5 శాతం నష్టపోయాయి. యాక్సిస్ బ్యాంక్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, ట్రెంట్ నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. లాభపడిన వాటిలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్ ఉన్నాయి.

కొత్త డెరవేటివ్(ఆప్షన్) సిరీస్‌ మొదలైన మొదటి రోజు మార్కెట్లు బలహీనంగా ముగిశాయి. ప్రధానంగా భారత్ - పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా మార్కెట్లో నష్టాలు కనిపించాయి. ఇవాళ ఉదయం మార్కెట్లు మంచి గ్యాప్ అప్ తో ప్రారంభమైనప్పటికీ తర్వాత భారీ నష్టాలలోకి జారుకున్నాయి. నిఫ్టీ, సెన్సెక్స్ సెషన్ మొదటి అర్ధభాగంలో పదునైన క్షీణతను చూసింది. అయితే, కొన్ని హెవీవెయిట్ స్టాక్‌లు పుంజుకోవడంతో రెండవ సెషన్ కొంతమేర నష్టాలు తగ్గడానికి సహాయపడింది.

చివరికి, నిఫ్టీ ఇండెక్స్ 0.86% తగ్గి 24,039.35 వద్ద స్థిరపడింది. ఇవాళ అన్ని రంగాలు చాలా వరకు రెడ్‌లో ట్రేడ్ అయ్యాయి. రియాల్టీ, ఫార్మా, ఎనర్జీ టాప్ లూజర్‌లుగా నిలువగా, నిఫ్టీ మిడ్‌క్యాప్ మరియు స్మాల్ క్యాప్ సూచీలు రెండూ ఒక్కొక్కటి రెండు శాతం మించి నష్టాలతో ముగియడంతో బ్రాడర్ మార్కెట్లలో ఒత్తిడి మరింత స్పష్టంగా కనిపించింది. పెరిగిన భౌగోళిక రాజకీయ అనిశ్చితి పెట్టుబడిదారులను రిస్క్-ఆఫ్ విధానాన్ని అవలంబించడానికి ఉసికొల్పింది. మరోవైపు మొన్నటి వరకూ సాగిన బుల్ ర్యాలీ తర్వాత మదుపర్లు లాభాల బుకింగ్‌కు చూడ్డంతో ఈ పరిస్థితి ఎదురైంది.


ఇవి కూడా చదవండి

Waqf Bill Supreme Court hearing: వక్ఫ్ బిల్లు చట్టభద్ధతపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ

Inflation: సాధారణ ప్రజలకు గుడ్ న్యూస్.. 67 నెలల కనిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం

Updated Date - Apr 25 , 2025 | 04:49 PM