ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market Crash: స్టాక్‌ మార్కెట్‌ బేర్‌

ABN, Publish Date - Aug 09 , 2025 | 03:18 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో ట్రంప్‌ సుంకాల పోటు కొనసాగుతోంది. ఈ దెబ్బతో శుక్రవారం సెన్సెక్స్‌ 765.47 పాయింట్ల

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో ట్రంప్‌ సుంకాల పోటు కొనసాగుతోంది. ఈ దెబ్బతో శుక్రవారం సెన్సెక్స్‌ 765.47 పాయింట్ల నష్టంతో 79,857.79 వద్ద ముగియగా నిఫ్టీ 232.85 పాయింట్ల నష్టంతో 24,363.39 వద్ద క్లోజయింది. బీఎ్‌సఈలో లిస్టయిన కంపెనీల షేర్ల మార్కెట్‌ విలువ దాదాపు రూ.5 లక్షల కోట్లు పడిపోయి రూ.440.63 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్‌, నిఫ్టీ గత మూడు నెలల్లో ఇంత కనిష్ఠ స్థాయిలో ముగియడం ఇదే మొదటిసారి. గత ఆరు వారాల నుంచీ ఈ రెండు కీలక సూచీలు నష్టాల్లో నడుస్తున్నాయి. కొవిడ్‌ తర్వాత సూచీలు వరుసగా ఇన్ని వారాలు నష్టాలతో ముగియడం ఇదే మొదటిసారి. ట్రంప్‌ సుంకాల పోటు కారణంగా ఎఫ్‌పీఐలు శుక్రవారం సైతం పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగాయి. దీంతో రియల్టీ, మెటల్‌, టెలికం, కన్జుమర్‌ డ్యూరబుల్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, కమోడిటీ కంపెనీల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. అయితే నిఫ్టీకి 24,200-24150 మధ్య గట్టి మద్దతు కనిపిస్తోంది. ఆ స్థాయిని కూడా బ్రేక్‌ చేస్తే నిఫ్టీ 23,750 పాయింట్లకు కూడా పడిపోయే ప్రమాదం ఉందని టెక్నికల్‌ అనలిస్టుల అంచనా.

పసిడి ధర మరింత పైకి : స్టాక్‌ మార్కెట్‌ పతనంలో పసిడి ధర శుక్రవారం మరింత జోరందుకుంది. ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం రూ.800 లాభంతో రూ.1,03,420కు చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. కిలో వెండి రూ.1,000 పెరిగి రూ1.15 లక్షల వద్ద ముగిసింది. గత ఐదు రోజుల్లోనే దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.5,800, కిలో వెండి ధర రూ.5,500 పెరిగాయి.

Updated Date - Aug 09 , 2025 | 03:18 AM