ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market: నష్టాలతో ప్రారంభం.. ఈరోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

ABN, Publish Date - Jun 30 , 2025 | 10:11 AM

మొదట ఫ్లాట్‌గా మొదలైన సూచీలు ఆ తర్వాత నష్టాల బాట పట్టాయి. ఆసియా-పసిఫిక్ ప్రధాన మార్కెట్లు అన్నీ సానుకూలంగానే కదలాడుతున్నాయి. దేశీయ సూచీల నష్టాలకు లాభాల స్వీకరణ మాత్రమే కారణంగా కనిపిస్తోంది. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Stock Market

వరుసగా మూడ్రోజులు లాభాలు ఆర్జించిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. దేశీయ సూచీలు తొమ్మిది నెలల గరిష్టానికి చేరడంతో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. మొదట ఫ్లాట్‌గా మొదలైన సూచీలు ఆ తర్వాత నష్టాల బాట పట్టాయి. ఆసియా-పసిఫిక్ ప్రధాన మార్కెట్లు అన్నీ సానుకూలంగానే కదలాడుతున్నాయి. దేశీయ సూచీల నష్టాలకు లాభాల స్వీకరణ మాత్రమే కారణంగా కనిపిస్తోంది. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. (Business News).

గత శుక్రవారం ముగింపు (84, 058)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత వెంటనే నష్టాల్లోకి కూరుకుపోయింది. టెక్, టెలికామ్ రంగాలు ప్రధానంగా నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 221 పాయింట్ల నష్టంతో 83, 837 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 58 పాయింట్ల లాభంతో 25, 578 వద్ద కొనసాగుతోంది.

సెన్సెక్స్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా, హిందుస్థాన్ కాపర్, కెనరా బ్యాంక్, అరబిందో ఫార్మా, ఫెడరల్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. మహానగర్ గ్యాస్, హీరో మోటోకార్ప్, రెడ్డీస్ ల్యాబ్స్, పేజ్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ కార్డు షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 104 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 85.47గా ఉంది.

ఇవీ చదవండి:

గుడ్ న్యూస్.. రూ.98 వేల దిగువకు బంగారం.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

సిబిల్ స్కోర్ కారణంగా ఉద్యోగం తొలగింపు..

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 30 , 2025 | 10:11 AM