ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market: నష్టాలతోనే ప్రారంభం.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే..

ABN, Publish Date - Jul 14 , 2025 | 10:23 AM

టీసీఎస్ త్రైమాసిక ఫలితాలు నిరాశాజనకంగా ఉన్న నేపథ్యంలో ఐటీ రంగం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కాఫర్ దిగుమతులపై 50 శాతం సుంకం విధించడం, ఫార్మా ఉత్పత్తులపై కూడా భారీ పన్నులు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

Stock Market

అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నడుమ దేశీయ సూచీలు ఈ వారాన్ని నష్టాలతోనే ప్రారంభించాయి. టీసీఎస్ త్రైమాసిక ఫలితాలు నిరాశాజనకంగా ఉన్న నేపథ్యంలో ఐటీ రంగం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కాఫర్ దిగుమతులపై 50 శాతం సుంకం విధించడం, ఫార్మా ఉత్పత్తులపై కూడా భారీ పన్నులు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కదలాడుతున్నాయి. (Business News).

గత శుక్రవారం ముగింపు (82, 500)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత వెంటనే నష్టాల్లోకి జారుకుంది. ఒక దశలో దాదాపు 400 పాయింట్లు కోల్పోయి 82, 109 వద్ద కనిష్టానికి చేరింది. ప్రస్తుతం ఉదయం 10:15 గంటల సమయంలో సెన్సెక్స్ 138 పాయింట్ల పాయింట్ల నష్టంతో 82, 361 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 31 పాయింట్ల నష్టంతో 25, 118 వద్ద కొనసాగుతోంది.

సెన్సెక్స్‌లో వొడాఫోన్ ఐడియా, కేఈఐ ఇండస్ట్రీస్, పిరామిల్ ఎంటర్‌ప్రైజెస్, బీఎస్‌ఈ లిమిటెడ్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. దివీస్ ల్యాబ్స్, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంక్, మాజగాన్ డాక్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 402 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 114 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 85.94గా ఉంది.

ఇవీ చదవండి:

ఏఐ హార్డ్‌వేర్ రేసులో బాగా వెనకబడ్డాం.. ఇంటెల్ సీఈఓ ఆందోళన

బ్యాంక్ లాకర్‌లో బంగారం దాస్తున్నారా.. ఈ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఏం చెబుతున్నారో తెలిస్తే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 14 , 2025 | 10:38 AM