Stock Market: వరుస నష్టాలకు బ్రేక్ .. 400 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్
ABN, Publish Date - May 21 , 2025 | 04:26 PM
వరుసగా మూడు రోజులుగా నష్టపోతున్న స్టాక్ మార్కెట్ బుధవారం లాభాల బాటలో సాగింది. ఫార్మా, రియాల్టీ షేర్లు లాభాల బాటలో సాగడం దేశీయ సూచీలకు కలిసివచ్చింది. అలాగే ఆటో, బ్యాంక్, ఎఫ్‌ఎమ్‌సీజీ రంగాలు కూడా లాభపడ్డాయి. అయితే విదేశీ మదుపర్లు అమ్మకాలు తగ్గకపోవడం కాస్త ఆందోళన కలిగిస్తోంది.
వరుసగా మూడు రోజులుగా నష్టపోతున్న స్టాక్ మార్కెట్ బుధవారం లాభాల బాటలో సాగింది. ఫార్మా, రియాల్టీ షేర్లు లాభాల బాటలో సాగడం దేశీయ సూచీలకు కలిసివచ్చింది. అలాగే ఆటో, బ్యాంక్, ఎఫ్‌ఎమ్‌సీజీ రంగాలు కూడా లాభపడ్డాయి. అయితే విదేశీ మదుపర్ల అమ్మకాలు తగ్గకపోవడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఓ దశలో భారీగా లాభపడిన సూచీలు చివరకు ఓ మోస్తారు లాభాలతో రోజును ముగించాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో ముగిశాయి. (Business News).
మంగళవారం ముగింపు (81, 186)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 150 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింతగా లాభాల్లోకి దూసుకెళ్లింది. ఒక దశలో 800 పాయింట్లకు పైగా లాభపడి 82, 021 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. అయితే మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు మొదలయ్యాయి. దీంతో సెన్సెక్స్ కిందకు దిగి వచ్చింది. చివరకు 410 పాయింట్ల లాభంతో 81, 596 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. 129 పాయింట్ల లాభంతో 24, 813 వద్ద రోజును ముగించింది.
సెన్సెక్స్‌లో భారత్ ఎలక్ట్రానిక్స్, సీమన్స్, సోలార్ ఇండస్ట్రీస్, పీబీ ఫిన్‌టెక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. డిక్సన్ టెక్నాలజీస్, ఆదిత్య బిర్లా ఫేషన్స్, మ్యాక్స్ హెల్త్‌కేర్, ఇండస్ ఇండ్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 436 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 197 పాయింట్లు ఎగబాకింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 85.64గా ఉంది.
ఇవీ చదవండి:
Loan Apps: యాప్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..
Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 21 , 2025 | 04:27 PM