Stock Market: ఒడిదుడుకుల్లో దేశీయ సూచీలు.. టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ABN, Publish Date - Jun 19 , 2025 | 10:12 AM
అంతర్జాతీయంగా అనిశ్చితి వాతావరణం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యాధాతథంగా కొనసాగించడంతో మార్కెట్లు ఊగిసలాట ధోరణిని కనబరుస్తున్నాయి. మెటల్, ఆటో, పవర్ సెక్టార్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దీంతో మార్కెట్ నష్టాలతో రోజును ప్రారంభించింది.
అంతర్జాతీయంగా అనిశ్చితి వాతావరణం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యాధాతథంగా కొనసాగించడంతో మార్కెట్లు ఊగిసలాట ధోరణిని కనబరుస్తున్నాయి. మెటల్, ఆటో, పవర్ సెక్టార్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దీంతో మార్కెట్ నష్టాలతో రోజును ప్రారంభించింది. అయితే ప్రస్తుతం ఆరంభ నష్టాల నుంచి సూచీలు గట్టెక్కాయి. భౌగోళిక కారణాలతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో సూచీలు లాభనష్టాలతో దోబూచులాడుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. (Business News).
బుధవారం ముగింపు (81, 444)తో పోల్చుకుంటే గురువారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత వెంటనే నష్టాల్లోకి కూరుకుపోయింది. ఒక దశలో 200 పాయింట్లకు పైగా కోల్పోయి 81, 191 వద్ద కనిష్టాన్ని తాకింది. అయితే ప్రస్తుతం మళ్లీ లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 29 పాయింట్ల లాభంతో 81, 474 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 8 పాయింట్ల లాభంతో 24, 820 వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్‌లో ఇండస్ ఇండ్ బ్యాంక్, అవెన్యూ సూపర్‌మార్కెట్, ఆర్బీఎల్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సీసీఎల్ ప్రోడక్ట్స్ ఇండియా షేర్లు లాభాల్లో ఉన్నాయి. హిందుస్థాన్ జింక్, మ్యాక్స్ హెల్త్‌కేర్, ఎస్బీఐ కార్డు, బ్లూ స్టార్ షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 322 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 29 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 86.54గా ఉంది.
ఇవి కూడా చదవండి..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 19 , 2025 | 10:12 AM