Stock Market: సూచీలకు స్వల్ప లాభాలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ABN, Publish Date - Aug 14 , 2025 | 03:59 PM
గత వారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు ప్రస్తుతం కోలుకుంటున్నాయి. బుధవారం భారీ లాభాలను ఆర్జించిన సూచీలు గురువారం స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ మాత్రం నష్టాలతోనే రోజును ముగించింది.
గత వారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు ప్రస్తుతం కోలుకుంటున్నాయి. బుధవారం భారీ లాభాలను ఆర్జించిన సూచీలు గురువారం స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ మాత్రం నష్టాలతోనే రోజును ముగించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు విషయంలో గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందన్న వార్తలు వస్తుండడం కాస్త సానుకాలాంశంగా కనిపిస్తోంది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో రోజును ముగించాయి (Business News).
బుధవారం ముగింపు (80, 539)తో పోల్చుకుంటే గురువారంవారం ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సెన్సెక్స్ రోజులో చాలా సమయం లాభాల్లోనే కదలాడింది. గురువారం సెన్సెక్స్ 80, 489-80,751 శ్రేణి మధ్యలో కదలాడింది. చివరకు సెన్సెక్స్ 57 పాయింట్ల స్వల్ప లాభంతో 80, 597 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 11.95 పాయింట్ల లాభంతో 24, 631 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్‌లో ముత్తూట్ ఫైనాన్స్, మనప్పురం ఫిన్‌కార్ప్, కల్యాణ్ జువెల్లర్స్, యూనో మిండా, ఇన్ఫోఎడ్జ్ షేర్లు లాభాలను ఆర్జించాయి. ఎన్‌ఎమ్‌డీసీ, హిందుస్థాన్ పెట్రో, మ్యాక్స్ హెల్త్‌కేర్, వోడాఫోన్ ఐడియా, ఎన్‌హెచ్‌పీసీ షేర్లు నష్టాల బాటలో నడిచాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 177 పాయింట్లు కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ 160 పాయింట్లు ఆర్జించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 87.55గా ఉంది.
ఇవి కూడా చదవండి
ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి
రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 14 , 2025 | 03:59 PM