Stock Market: వరుస నష్టాలకు బ్రేక్.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే
ABN, Publish Date - Jun 04 , 2025 | 04:07 PM
గత మూడు రోజులుగా నష్టాలను ఎదుర్కొన్న దేశీయ సూచీలు బుధవారం లాభాలను ఆర్జించాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, హెవీ వెయిట్ షేర్లలో కొనుగోళ్లు స్టాక్ మార్కెట్‌ను ముందుకు నడిపించాయి. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడం కూడా కలిసి వచ్చింది.
గత మూడు రోజులుగా నష్టాలను ఎదుర్కొన్న దేశీయ సూచీలు బుధవారం లాభాలను ఆర్జించాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, హెవీ వెయిట్ షేర్లలో కొనుగోళ్లు స్టాక్ మార్కెట్‌ను ముందుకు నడిపించాయి. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడం కూడా కలిసి వచ్చింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో రోజును ముగించాయి. (Business News).
మంగళవారం ముగింపు (80, 737)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ కాసేపు లాభనష్టాలతో దోబూచులాడింది. ఆ తర్వాత లాభాల్లోకి ప్రవేశించి స్థిరంగా కొనసాగింది. బుధవారం సెన్సెక్స్ 80, 705 - 81, 087 శ్రేణి మధ్యలో కొనసాగింది. చివరకు సెన్సెక్స్ 260 పాయింట్ల లాభంతో 80, 998 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 77 పాయింట్ల లాభంతో 24, 620 వద్ద రోజును ముగించింది. హెవీ వెయిట్ షేర్లలో కొనుగోళ్లు ప్రధాన సూచీలను ముందుకు నడిపించాయి.
సెన్సెక్స్‌లో రైల్ వికాస్, పీబీ ఫిన్‌టెక్, సీఈఎస్‌సీ, జుబిలెంట్ ఫుడ్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్, చోలా ఇన్వెస్ట్, ఆల్కెమ్ ల్యాబ్స్, మనప్పురం ఫైనాన్స్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 407 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 76 పాయింట్లు లాభపడింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 85.90గా ఉంది.
ఇవి కూడా చదవండి
ప్రజలపై ప్రతీకారంగానే వైసీపీ వెన్నుపోటు దినం
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 04 , 2025 | 04:07 PM