ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market: ఆర్బీఐ గుడ్‌న్యూస్.. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ABN, Publish Date - Jun 09 , 2025 | 04:10 PM

అంచనాలకు మించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను అరశాతం మేర తగ్గించడం దేశీయ సూచీలకు బూస్ట్ ఇచ్చింది. అలాగే అంతర్జాతీయ పరిణామాలు, నగదు నిల్వల నిష్పత్తిలో ఆర్బీఐ కోత విధించడం కూడా మార్కెట్లకు కలిసివస్తోంది. ఈ పరిణామాల కారణంగా మార్కెట్‌ పాజిటివ్‌గా రియాక్ట్ అయింది.

Stock Market

అంచనాలకు మించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను అరశాతం మేర తగ్గించడం దేశీయ సూచీలకు బూస్ట్ ఇచ్చింది. అలాగే అంతర్జాతీయ పరిణామాలు, నగదు నిల్వల నిష్పత్తిలో ఆర్బీఐ కోత విధించడం కూడా మార్కెట్లకు కలిసివస్తోంది. ఈ పరిణామాల కారణంగా మార్కెట్‌ పాజిటివ్‌గా రియాక్ట్ అయింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో రోజును ముగించాయి. (Business News).

గత శుక్రవారం ముగింపు (82, 188)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 380 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఒక దశలో దాదాపు 500 పాయింట్లు లాభపడి 82, 669 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. చివరకు సెన్సెక్స్ 256 పాయింట్ల లాభంతో 82, 445 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 100 పాయింట్ల లాభంతో 25, 103 వద్ద రోజును ముగించింది.

సెన్సెక్స్‌లో ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్, బంధన్ బ్యాంక్, ఎమ్‌సీఎక్స్ ఇండియా, మనప్పురం ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. కల్యాణ్ జువెల్లర్స్, ఏపీఎల్ అపోలో, ఎటర్నల్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 664 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 261 పాయింట్లు లాభపడింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 85.62గా ఉంది.

ఇవీ చదవండి:

రెస్టారెంట్‌లో లేట్ సర్వీస్..హోటల్ ధ్వంసం చేసిన కస్టమర్లు

ప్రధానిని పలకరించిన యూనస్..బంగ్లాదేశ్ నుంచి మోదీకి సందేశం

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 09 , 2025 | 04:10 PM