Stock Market: అమెరికా ట్రేడ్ వార్.. నష్టాలతో ముగిసిన దేశీయ సూచీలు..
ABN, Publish Date - Jul 09 , 2025 | 04:13 PM
ఈ రోజు (జులై 9)తో పలు దేశాలపై అమెరికా విధించిన వాణిజ్య సుంకాల డెడ్‌లైన్ ముగిసింది. ఆ డెడ్‌లైన్‌ను ఆగస్ట్ 1వరకు పొడిగించిన ట్రంప్ ఆ తర్వాత ఇంక పొడిగించేది లేదని స్పష్టం చేశారు. అలాగే కాపర్ దిగుమతులపై 50 శాతం సుంకం విధిస్తామని హెచ్చరించారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతో రోజును ముగించాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పలు దేశాలతో ట్రేడ్ వార్‌కు తెరలేపడం అంతర్జాతీయ మార్కెట్లపై నెగిటివ్ ప్రభావాన్ని చూపెడుతోంది. ఈ రోజు (జులై 9)తో పలు దేశాలపై అమెరికా విధించిన వాణిజ్య సుంకాల డెడ్‌లైన్ ముగిసింది. ఆ డెడ్‌లైన్‌ను ఆగస్ట్ 1వరకు పొడిగించిన ట్రంప్ ఆ తర్వాత ఇంక పొడిగించేది లేదని స్పష్టం చేశారు. అలాగే కాపర్ దిగుమతులపై 50 శాతం సుంకం విధిస్తామని హెచ్చరించారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతో రోజును ముగించాయి. (Business News).
మంగళవారం ముగింపు (83, 712)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 100 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభనష్టాలతో దోబూచులాడుతోంది. అయితే చివరి గంటలో అమ్మకాలు వెల్లువెత్తాయి. బుధవారం సెన్సెక్స్ 83, 382-83,781 శ్రేణి మధ్యలో కదలాడింది. చివరకు సెన్సెక్స్ 176 పాయింట్ల నష్టంతో 83, 536 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 46 పాయింట్ల నష్టంతో 25, 476 వద్ద రోజును ముగించింది.
సెన్సెక్స్‌లో పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, నైకా, ఆర్బీఎల్ బ్యాంక్, మ్యాన్‌కైండ్ ఫార్మా, ఐఈఎక్స్ షేర్లు లాభాలు ఆర్జించాయి. గెయిల్ యూనియన్ బ్యాంక్, మ్యాక్స్ హెల్త్‌కేర్, ఫియోనిక్స్ మిల్స్, వేదాంత షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 75 పాయింట్ల నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టీ 42 పాయింట్లు కోల్పోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 85.67గా ఉంది.
ఇవీ చదవండి:
మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 09 , 2025 | 04:13 PM