ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market: స్టాక్ మార్కెట్లకు నష్టాలు.. 25 వేల దిగువకు నిఫ్టీ

ABN, Publish Date - May 19 , 2025 | 04:15 PM

ఐటీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో దేశీయ సూచీలు నష్టాలను నమోదు చేశాయి. ఇటీవల మార్కెట్లు వరుసగా లాభాలను ఆర్జిస్తుండడంతో మదుపర్లు ఈ రోజు లాభాల స్వీకరణకు దిగారు. అలాగే అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కూడా మార్కెట్లకు నెగిటివ్‌గా మారాయి.

Stock Market

ఐటీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో దేశీయ సూచీలు నష్టాలను నమోదు చేశాయి. ఇటీవల మార్కెట్లు వరుసగా లాభాలను ఆర్జిస్తుండడంతో మదుపర్లు ఈ రోజు లాభాల స్వీకరణకు దిగారు. అలాగే అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కూడా మార్కెట్లకు నెగిటివ్‌గా మారాయి. అమెరికా ప్రభుత్వ క్రెడిట్ రేటింగ్ తగ్గడంతో ఐటీ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ మళ్లీ 25 వేల దిగువకు వచ్చింది. (Business News).


గత శుక్రవారం ముగింపు (82, 330)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ రోజంతా లాభనష్టాలతో దోబూచులాడింది. మధ్యాహ్నం తర్వాత నష్టాల్లోకి జారుకుంది. 81, 964 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరింది. సోమవారం సెన్సెక్స్ 81, 964-82, 424 శ్రేణి మధ్యలో కదలాడింది. చివరకు 271 పాయింట్ల నష్టంతో 82,059 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. 74 పాయింట్ల నష్టంతో 24, 945 వద్ద రోజును ముగించింది.


సెన్సెక్స్‌లో డెలివరీ, దివీస్ ల్యాబ్స్, సీఈఎస్‌సీ, అస్ట్రాల్ లిమిటెడ్ షేర్లు లాభాల్లో ముగిశాయి. వొడాఫోన్ ఐడియా, జీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్, ఎటర్నల్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 44 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 65 పాయింట్ల లాభాన్ని ఆర్జించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 85.40గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 19 , 2025 | 04:15 PM