ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే..

ABN, Publish Date - Jun 10 , 2025 | 03:54 PM

సోమవారం లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం కాస్త ఒడిదుడుకులకు లోనయ్యాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాల కారణంగా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడ్ అయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను అరశాతం మేర తగ్గించడం, నగదు నిల్వల నిష్పత్తిలో కోత విధించడం కాస్తా కలిసి వచ్చింది.

Stock Market

సోమవారం లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం కాస్త ఒడిదుడుకులకు లోనయ్యాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాల కారణంగా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడ్ అయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను అరశాతం మేర తగ్గించడం, నగదు నిల్వల నిష్పత్తిలో కోత విధించడం కాస్తా కలిసి వచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం లాభపడిన సెన్సెక్స్, నిఫ్టీ మంగళవారం ఫ్లాట్‌గా ట్రేడ్ అయ్యాయి. (Business News).

సోమవారం ముగింపు (82, 445)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 200 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభనష్టాలతో దోబూచులాడింది. బుధవారం సెన్సెక్స్ 82, 240-82,680 శ్రేణి మధ్యలో కదలాడింది. చివరకు సెన్సెక్స్ 53 పాయింట్ల నష్టంతో 82, 391 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 1.05 పాయింట్ లాభంతో 25, 104 వద్ద రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం భారీగా నష్టపోయింది.

సెన్సెక్స్‌లో గ్రాసిమ్, ఓరాకిల్ ఫిన్‌సర్వ్, బ్లూస్టార్, ఆదానీ టోటల్ గ్యాస్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఆర్బీఎల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఎన్‌బీసీసీ, మార్కోటెక్ డెవలపర్స్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 6 పాయింట్ల స్వల్ప లాభంతో రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 210 పాయింట్లు కోల్పోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 85.60గా ఉంది.

ఇవీ చదవండి:

రెస్టారెంట్‌లో లేట్ సర్వీస్..హోటల్ ధ్వంసం చేసిన కస్టమర్లు

ప్రధానిని పలకరించిన యూనస్..బంగ్లాదేశ్ నుంచి మోదీకి సందేశం

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 10 , 2025 | 03:54 PM