ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market: లాభాలతో ముగిసిన మార్కెట్లు.. 340 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..

ABN, Publish Date - Mar 17 , 2025 | 03:56 PM

గత కొన్ని వారాలుగా భారీగా నష్టపోయిన దేశీయ సూచీలు మళ్లీ లాభాల ట్రాక్ ఎక్కాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు కూడా స్టాక్ మార్కెట్లకు కలిసి వచ్చాయి. దీంతో లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ రోజంతా లాభాల్లోనే కదలాడాయి.

Stock Market

అమెరికా ఆర్థిక విధానాలతో సతమతమై భారీగా నష్టపోయిన దేశీయ సూచీలు మళ్లీ లాభాల ట్రాక్ ఎక్కాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు కూడా స్టాక్ మార్కెట్లకు కలిసి వచ్చాయి. దీంతో లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ రోజంతా లాభాల్లోనే కదలాడాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌, బ్యాంక్ నిఫ్టీ కూడా లాభాలను ఆర్జించాయి (Business News).


గత శుక్రవారం ముగింపు (73, 828)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం స్వల్ప లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభాల్లోకి దూసుకెళ్లింది. ఒక దశలో దాదాపు 500 పాయింట్లు పెరిగి 74, 376 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. 12 గంటల సమయంలో లాభాలను కోల్పోయినప్పటికీ చివరి గంటలో మళ్లీ కోలుకుంది. చివరకు సెన్సెక్స్ 314 పాయింట్ల లాభంతో 74, 169 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 111 పాయింట్ల లాభంతో 22, 508 వద్ద స్థిరపడింది.


సెన్సెక్స్‌లో ఐఈఎక్స్, ముత్తూట్ ఫైనాన్స్, యూపీఎల్, హుడ్కో షేర్లు లాభాలను ఆర్జించాయి. ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్, ప్రెస్టేజ్ ఎస్టేట్, ఎల్‌టీఐ మైండ్ ట్రీ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ షేర్లు నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 336 పాయింట్లు ఎగబాకింది. బ్యాంక్ నిఫ్టీ 293 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 86.80 గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 17 , 2025 | 03:56 PM