ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market: భారత్-పాక్ కాల్పుల విరమణ.. స్టాక్ మార్కెట్లకు ఫుల్ జోష్

ABN, Publish Date - May 12 , 2025 | 10:12 AM

భారత్-పాకిస్తాన్ మద్య ఉద్రిక్తతల నేపథ్యంలో గత వారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూసిన సంగతి తెలిసిందే. శనివారం ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీంతో భారత్ స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి.

Stock Market

భారత్-పాకిస్తాన్ మద్య ఉద్రిక్తతల నేపథ్యంలో గత వారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూసిన సంగతి తెలిసిందే. శనివారం ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీంతో భారత్ స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. అన్ని రంగాలూ లాభాల్లో కదలాడుతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 2000 పాయింట్లకు పైగా లాభంలో ఉంది. నిఫ్టీ కూడా అదే బాటలో నడుస్తోంది (Business News).


గత శుక్రవారం ముగింపు (79, 454)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం 800 పాయింట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరిన్ని లాభాలను ఆర్జించింది. 2000 పాయింట్లకు పైగా లాభంలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఉదయం 10:05 గంటల సమయంలో 2223 పాయింట్ల లాభంతో 81,678 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదులుతోంది. ప్రస్తుతం 694 పాయింట్ల లాభంతో 24, 702 వద్ద కొనసాగుతోంది. అమెరికా-చైనా మధ్య కూడా టారిఫ్ చర్చలు సానుకూలంగా ముగిసినట్టు వార్తలు వస్తుండడం కూడా మార్కెట్లకు కలిసి వస్తోంది.


సెన్సెక్స్‌లో హెచ్‌ఎఫ్‌సీఎల్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ఎస్కార్ట్స్ కుబాటా, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. సన్‌ఫార్మా, దివీస్ ల్యాబ్స్, గ్లెన్‌మార్క్, సోలార్ ఇండస్ట్రీస్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1699 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 1566 పాయింట్ల లాభంతో ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 12 , 2025 | 10:24 AM