Stock Market Loses: రూ 3 లక్షల 5 కోట్లు హాంఫట్
ABN, Publish Date - Aug 07 , 2025 | 02:31 AM
ఆర్‌బీఐ రెపోరేటును యథాతథంగా కొనసాగించిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజూ నష్టపోయింది. సెన్సెక్స్ 166.26 పాయింట్ల నష్టంతో 80,543.99 వద్ద ముగియగా నిఫ్టీ 75.35 పాయింట్ల నష్టంతో 24,574.20 వద్ద ముగిసింది...
రెండో రోజూ నష్టాలే
ముంబై: ఆర్‌బీఐ రెపోరేటును యథాతథంగా కొనసాగించిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజూ నష్టపోయింది. సెన్సెక్స్ 166.26 పాయింట్ల నష్టంతో 80,543.99 వద్ద ముగియగా నిఫ్టీ 75.35 పాయింట్ల నష్టంతో 24,574.20 వద్ద ముగిసింది. దీంతో బీఎ్‌సఈలో లిస్టెడ్ కంపెనీల షేర్ల మార్కెట్ విలువ రూ.3.50 లక్షల కోట్లు దిగజారి రూ.445.19 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 18 షేర్లు నష్టాలతో ముగిశాయి. ఒక్క బ్యాంకెక్స్ తప్ప మిగతా అన్ని సూచీలు నష్టాలతో ముగిశాయి. ఆర్‌బీఐ నిర్ణయం ప్రభావంతో వడ్డీరేట్లపై ఎక్కువగా ఆధారపడిన ఆటో, రియల్టీ, బ్యాంకింగ్ కంపెనీల షేర్లు నష్టాలతో ముగిశాయి. కొన్ని కౌంటర్లయితే ఐదు శాతం వరకు నష్ట పోయాయి. సుంకాల భయం వెంటాడుతున్నా నిఫ్టీకి 24,500 వద్ద గట్టి మద్దతు లభించే అవకాశం ఉందని జియోజిత్ ఇన్వె్‌స్టమెంట్స్ సంస్థ రీసెర్చి హెడ్ వినోద్ నాయర్ అంచనా.
లిస్టింగ్‌లో సత్తా చూపిన ఎన్‌ఎ్‌సడీఎల్
ఇటీవల ఐపీఓకు వచ్చిన ఎన్‌ఎ్‌సడీఎల్ కంపెనీ షేర్లు బుధవారం బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈల్లో లిస్టయ్యాయి. రూ.800కు జారీ చేసిన ఈ కంపెనీ షేర్లు బీఎ్‌సఈలో 10 శాతం లాభంతో రూ.880 వద్ద లిస్టయ్యాయి. ఇంట్రా డేలో 18 శాతం లాభంతో రూ.943.75కు చేరినా చివరికి 17 శాతం లాభంతో రూ.936 వద్ద ముగిశాయి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.18,720 కోట్లకు చేరింది. .
ఐదు ఐపీఓలకు లైన్ క్లియర్
ఐదు కంపెనీల ఐపీఓలకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాటిలో ప్రిస్టేజ్ హాస్పిటాలిటీ వెంచర్స్, ఆనంద్ రాఠీ షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్, ఎస్‌ఎ్‌సఎఫ్ ప్లాస్టిక్స్ ఇండియా, గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ, ఈప్యాక్ ప్రీఫ్యాబ్ టెక్నాలజీస్ కంపెనీలున్నాయి.
ఇవి కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం.. ధరలు ఎలా ఉన్నాయంటే..
ఆర్బీఐ కీలక ప్రకటన.. రెపో రేటు యథాతథం..
మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 07 , 2025 | 02:31 AM