ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

3 రోజులు రూ 9 70 లక్షల కోట్లు

ABN, Publish Date - Jun 27 , 2025 | 05:26 AM

పశ్చిమాసియా ఉద్రిక్తతలు సడలిన నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్‌ వరుసగా మూడో రోజు కూడా ర్యాలీలో పురోగమించింది. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో పాటు...

మార్కెట్లో అదే జోరు.. సెన్సెక్స్‌ 1000 పాయింట్లు అప్‌

ముంబై: పశ్చిమాసియా ఉద్రిక్తతలు సడలిన నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్‌ వరుసగా మూడో రోజు కూడా ర్యాలీలో పురోగమించింది. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో పాటు మార్కెట్‌ దిగ్గజాలైన హెచ్‌డీఎ్‌ఫసీ, రిలయన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ కౌంటర్లలో జరిగిన భారీ కొనుగోళ్లు మార్కెట్‌ను గురువారం ఉరకలెత్తించాయి. అంతర్జాతీయ విపణిలో అదుపులోనే ఉన్న క్రూడాయిల్‌ ధర (బ్యారెల్‌ 67.80 డాలర్లు) సైతం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచింది. ఈ నేపథ్యంలో గురువారం సెన్సెక్స్‌ 1000.36 పాయింట్లు లాభపడి 83,755.87 వద్ద ముగియగా నిఫ్టీ 304.25 పాయింట్లు లాభపడి 25,549 వద్ద క్లోజైంది. మూడు వరుస సెషన్లలో సెన్సెక్స్‌ 1859.08 పాయింట్లు లాభపడింది. బీఎ్‌సఈలో లిస్ట్‌ అయిన కంపెనీల మార్కెట్‌ విలువ మూడు రోజుల్లో రూ.9.7 లక్షల కోట్లు పెరిగి రూ.457 లక్షల కోట్లకు చేరింది.

ఎన్‌ఎ్‌సఈలో ఎలక్ర్టిసిటీ ఫ్యూచర్స్‌

రాబోయే రెండు, మూడు వారాల్లో ఎలక్ర్టిసిటీ ఫ్యూచర్స్‌ కాంట్రాక్టులు ప్రవేశపెట్టనున్నట్టు ఎన్‌ఎ్‌సఈ ప్రకటించింది. విద్యుత్‌ కొనుగోలుదారులు, విక్రేతలు, ట్రేడర్లు, పారిశ్రామిక రంగం, రిటైలర్లు ధరల రిస్క్‌ తగ్గించుకోవడానికి ఈ చర్య దోహదపడుతుందని తెలిపింది. త్వరలోనే దీని ప్రారంభ తేదీని ప్రకటించనున్నట్టు ఎన్‌ఎ్‌సఈ పవర్‌ విభాగం హెడ్‌ హరీశ్‌ అహూజా తెలిపారు.

ఆర్‌ఐఎల్‌ మళ్లీ

20 లక్షల కోట్ల శిఖరం పైకి...

అత్యంత విలువైన దేశీయ కంపెనీ అయిన రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ మరోసారి రూ.20 లక్షల కోట్ల మార్కెట్‌ విలువ గల కంపెనీగా అవతరించింది. గురువారం బీఎ్‌సఈలో ఆర్‌ఐఎల్‌ షేరు 1.90ు లాభపడి రూ.1,495.20 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎ్‌సఈలో సైతం అదే శాతం లాభంతో రూ.1,495.30 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.37,837.9 కోట్లు పెరిగి రూ.20,23,375.31 కోట్లకు చేరింది. ఈ ఏడాది ఇప్పటికి రిలయన్స్‌ షేరు 23 శాతం లాభపడగా ఫిబ్రవరి 13వ తేదీన ఆర్‌ఐఎల్‌ తొలిసారిగా రూ.20 లక్షల కీలకమైన మైలురాయిని చేరింది. మార్కెట్‌ విలువపరంగా హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ (రూ.15,51,218.93 కోట్లు), టీసీఎస్‌ (రూ.12,45,219.09 కోట్లు), భారతి ఎయిర్‌టెల్‌ (రూ.11,4,8,518.05 కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్‌ (రూ.10,27,838.79 కోట్లు)తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

నెస్లె ఇండియా 1:1 బోనస్‌ షేరు

ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం నెస్లె ఇండియా డైరెక్టర్ల బోర్డు బోనస్‌ షేర్ల జారీకి అనుమతించింది. ప్రస్తుత షేర్‌హోల్డర్లందరికీ వారి వద్ద గల రూపాయి ముఖ విలువ గల ఒక్కో షేరుకు అదే ముఖ విలువ గల ఒక షేరు బోన్‌సగా జారీ చేయనున్నట్టు తెలిపింది. ఇందుకు రికార్డు తేదీని త్వరలో ప్రకటించనున్నట్టు వెల్లడించింది. ఈ నిర్ణయం వచ్చే నెల 24వ తేదీన జరుగనున్న కంపెనీ వాటాదారుల అసాధారణ సర్వసభ్య సమావేశం (ఈజీఎం) అనుమతికి లోబడి ఉంటుందని చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సురేశ్‌ నారాయణన్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి..

వావ్.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

జూన్ 30లోపు ముగియాల్సిన ఆర్థిక కార్యకలాపాలు ఇవే.. పూర్తి చేశారా లేదా..

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 27 , 2025 | 05:26 AM