ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market Recovery: మార్కెట్లో అద్భుత రికవరీ

ABN, Publish Date - Aug 08 , 2025 | 05:46 AM

ఈక్విటీ మార్కెట్‌ గురువారం భారీ నష్టాల నుంచి అనూహ్యమైన పునరుజ్జీవం సాధించి లాభాలతో క్లోజైంది. ఐటీ, బ్యాంకింగ్‌ రంగాల షేర్లలో చివరి గంట కొనుగోళ్లు మార్కెట్‌కు ఊపిరులూదాయి. గురువారం ఆరంభం నుంచే...

ముంబై: ఈక్విటీ మార్కెట్‌ గురువారం భారీ నష్టాల నుంచి అనూహ్యమైన పునరుజ్జీవం సాధించి లాభాలతో క్లోజైంది. ఐటీ, బ్యాంకింగ్‌ రంగాల షేర్లలో చివరి గంట కొనుగోళ్లు మార్కెట్‌కు ఊపిరులూదాయి. గురువారం ఆరంభం నుంచే నష్టాల్లోనే ట్రేడయిన మార్కెట్‌.. ఒక్కసారిగా చివరి గంటలో ఇంట్రాడే కనిష్ఠ స్థాయి 79,811.29 నుంచి 926 పాయింట్ల మేర ఎగువకు దూసుకుపోయింది. చివరికి సెన్సెక్స్‌ 79.27 పాయింట్ల లాభంతో 80,623.26 వద్ద ముగిసింది. నిఫ్టీ 21.95 పాయింట్ల లాభంతో 24,596.15 వద్ద స్థిరపడింది. అమెరికా సుంకాల పోటు కారణంగా ఆరంభంలో భారీగా నష్టపోయినా డొనాల్డ్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య శాంతి చర్చలు జరిగే అవకాశం ఉన్నదన్న వార్తలు మార్కెట్లను లాభాల బాటలోకి నడిపించాయి.

ఎటర్నల్‌లో యాంట్‌ఫిన్‌ 1.46%వాటా విక్రయం

చైనా కుబేరుడు జాక్‌ మా నేతృత్వంలోని యాంట్‌ ఫైనాన్షియల్‌ గురువారం జొమాటో, బ్లింకిట్‌ బ్రాండ్ల మాతృ సంస్థ ఎటర్నల్‌లో 1.46 శాతం వాటాలను విక్రయించింది. ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా జరిగిన ఈ లావాదేవీ విలువ రూ.4,096.75 కోట్లు. ఒక్కో షేరు సగటు విక్రయ ధర రూ.289.91గా ఉంది. ఈ వాటాల విక్రయం అనంతరం ఎటర్నల్‌లో యాంట్‌ఫిన్‌ హోల్డింగ్‌ వాటా 1.95% నుంచి 0.49 శాతానికి తగ్గింది.

ఇవి కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం.. ధరలు ఎలా ఉన్నాయంటే..

ఆర్బీఐ కీలక ప్రకటన.. రెపో రేటు యథాతథం..

మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 08 , 2025 | 05:46 AM