Indian stock market update: మార్కెట్లో లాభాల స్వీకరణ
ABN, Publish Date - Jul 25 , 2025 | 02:35 AM
ప్రధాన కంపెనీల షేర్లలో మదుపరులు లాభాలు స్వీకరించడంతో పాటు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లూ పెట్టుబడులు వెన క్కి తీసుకోవడంతో ప్రామాణిక సూచీలు...
సెన్సెక్స్ 542 పాయింట్లు డౌన్
ముంబై: ప్రధాన కంపెనీల షేర్లలో మదుపరులు లాభాలు స్వీకరించడంతో పాటు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లూ పెట్టుబడులు వెన క్కి తీసుకోవడంతో ప్రామాణిక సూచీలు గురువారం భారీగా నష్టపోయాయి. ఒక దశలో 679 పాయింట్ల వరకు క్షీణించిన సెన్సెక్స్.. చివరికి 542.47 పాయింట్ల నష్టంతో 82,184.17 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 157.80 పాయింట్లు క్షీణించి 25,062.10 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 24 నష్టపోగా.. ట్రెంట్ షేరు 3.92 శాతం పతనమై సూచీ టాప్ లూజర్‌గా మిగిలింది. టెక్ మహీంద్రా 3.15 శాతం క్షీణించగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్‌సర్వ్, కోటక్ బ్యాంక్ షేర్లు ఒక శాతానికి పైగా నష్టపోయాయి. బీఎ్‌సఈలోని స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ సూచీలూ 0.50 శాతం వరకు తగ్గాయి. రంగాలవారీ సూచీల్లో ఫోకస్డ్ ఐటీ 2.27 శాతం, ఐటీ 1.90 శాతం, టెక్ 1.54 శాతం, ఎఫ్‌ఎంసీజీ 1.09 శాతం, రియల్టీ 1.03 శాతం తగ్గాయి.
ఇవీ చదవండి:
సంపన్నులు తమ ఆస్తులను ఎలా పెంచుకుంటారో తెలుసా.. సీఏ చెప్పిన ఈ సూత్రం తెలిస్తే..
వేతన జీవులకు అక్కరకొచ్చే 50-30-20 ఫార్ములా
Updated Date - Jul 25 , 2025 | 02:35 AM