SBI Chairman: ఎస్‌బీఐ భళా
ABN, Publish Date - Aug 09 , 2025 | 03:25 AM
ప్రభుత్వ రంగ బ్యాం కింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాలను మించా యి.
10% వృద్ధితో రూ.21,201 కోట్లకు లాభం
రూ.1,35,342 కోట్లకు పెరిగిన ఆదాయం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాం కింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాలను మించా యి. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో జూన్ త్రైమాసికానికి ఎస్‌బీఐ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 10 శాతం పెరుగుదలతో రూ.21,201 కోట్లకు చేరిం ది. ట్రెజరీ, ఫారెక్స్ కార్యకలాపాల్లో ఆకర్షణీయ లాభాలు ఇందుకు ప్రధానంగా దోహదపడ్డాయి. ఈ క్యూ1లో బ్యాంక్ స్టాండ్ అలోన్ నికర లాభం 12 శాతం పెరిగి రూ.19,160 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి స్టాండ్ అలోన్ లాభం రూ.17,035 కోట్లుగా ఉంది. జూన్ త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం గత ఏడాదితో పోల్చితే రూ.1,22,688 కోట్ల నుంచి రూ.1,35,342 కోట్లకు పెరిగింది. మరిన్ని విషయాలు..
ఈ క్యూ1లో మొత్తం రుణాలు 11.6 శాతం వృద్ధి చెందినప్పటికీ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) మాత్రం 0.13% తగ్గి రూ.41,072 కోట్లకు పరిమితమైంది. నికర వడ్డీ మార్జిన్ (ఎన్‌ఐఎం) కూడా 0.33ు క్షీణించి 3.02 శాతానికి జారుకుంది. ఆర్‌బీఐ రెపోరేటు తగ్గించడంతో పాటు డిపాజిట్ల రేట్లను దిగువకు సవరించేందుకు సమయం పట్టడం వడ్డీ మార్జిన్లపై ప్రభావం చూపింది. రెండో త్రైమాసికంలోనూ నికర వడ్డీ మార్జిన్‌పై ఒత్తిడి కొనసాగనుందని, ఆ తర్వా త మళ్లీ మెరుగుపడవచ్చని ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి 3 శాతం ఎన్‌ఐఎంను లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన చెప్పారు.
క్యూ1లో వడ్డీయేతర ఆదాయం ఏకంగా 55% ఎగబాకి రూ.17,346 కోట్లకు చేరుకుంది. అందులో ఫారెక్స్ కార్యకలాపాల ద్వారా ఆదాయం 352% పెరిగి రూ.1,632 కోట్లకు చేరగా.. పెట్టుబడుల విక్రయంపై లాభం 1445 వృద్ధితో రూ.6,326 కోట్లకు పెరిగింది.
నిర్వహణ వ్యయాలు 7.88% పెరిగి రూ.27,874 కోట్లకు చేరినప్పటికీ, వ్యయ వృద్ధిని కట్టడం చేయడం లాభదాయకత మెరుగుపడేందుకు దోహదపడింది.
బ్యాంక్ కార్పొరేట్ రుణాలు 5.7%, దేశీయ రిటైల్ రుణాలు 12.56%, విదేశీ రుణాలు 145 పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి 12 శాతం మొత్తం రుణ వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శెట్టి చెప్పారు. మొత్తం రూ.7 లక్షల కోట్ల రుణాలు ప్రస్తుతం పైప్‌లైన్‌లో ఉన్నాయన్నారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ అనిశ్చితులు మంజూరైన రుణాల విడుదలపై ప్రభావం చూపుతున్నాయఇ ఆయన చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరికి కార్పొరేట్ రుణాల మంజూరు పెరగవచ్చని, ఈ విభాగం వృద్ధి 10 శాతానికి పెరగవచ్చన్నారు. వినియోగ డిమాండ్‌పై స్పష్టత లేకపోవడంతో కంపెనీలు కొత్త పెట్టుబడులు పెట్టడంలేదన్నారు. పునరుత్పాదక ఇంధనం, డేటా సెంటర్ల రంగాల నుంచి రుణాలకు అధిక డిమాండ్ నెలకొందని శెట్టి తెలిపారు.
ఈ క్యూ1లో బ్యాంక్ స్థూల మొండి బకాయిలు (జీఎన్‌పీఏ) ఏ మార్పు లేకుండా 1.83 శాతంగా నమోదయ్యాయి. కాగా, కొత్తగా రూ.7,945 కోట్ల రుణాలు మొండి పద్దుల్లోకి జారుకున్నాయి. మొండి బాకీలతోపాటు ఇతర అవసరాల కోసం బ్యాంక్ కేటాయింపులు రూ.4,759 కోట్లకు పెరిగాయి. 2024-25 క్యూ1లో బ్యాంక్ ఇందుకోసం రూ.3,449 కోట్లు కేటాయించింది.
డిపాజిట్ల వృద్ధి 11.6 శాతంగా నమోదైంది. డిపాజిట్ల సేకరణ వ్యయం ఇప్పటికే పతాక స్థాయికి చేరిందని శెట్టి అన్నారు.
అనుబంధ విభాగాలవారీగా చూస్తే, ఎస్‌బీఐ లైఫ్ నికర లాభం రూ.549 కోట్లకు పెరగగా.. ఎస్‌బీఐ కార్డ్ లాభం రూ.556 కోట్లకు తగ్గింది. ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ విభాగం లాభం రూ.188 కోట్లుగా నమోదైంది.
బీఎ్‌సఈలో ఎస్‌బీఐ షేరు శుక్రవారం 0.09 శాతం తగ్గి రూ.804.55 వద్ద ముగిసింది.
టారి్‌ఫల ప్రభావం మాపై ఉండదు
ట్రంప్ సుంకాలతో నేరుగా ప్రభావితమవుతున్న 4-5 రంగాలకు బ్యాంక్ రుణాలిచ్చి ఉందని ఎస్‌బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి అన్నారు. అయితే, మొత్తం రుణాల్లో వీటి వాటా 2 శాతం లోపే కాబట్టి, ట్రంప్ సుంకాల ప్రభావం బ్యాంకింగ్ రంగంపై ఉండదన్నారు. ప్రస్తుత అనిశ్చితులు మూడో త్రైమాసికానికల్లా సద్దుమణగవచ్చని ఎస్‌బీఐ ఎండీ అశ్వినీ కుమార్ పేర్కొన్నారు.
Updated Date - Aug 09 , 2025 | 03:25 AM