ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వడ్డీరేట్లు మరింత కిందికే

ABN, Publish Date - May 06 , 2025 | 04:50 AM

దేశంలో వడ్డీరేట్లు మరింత తగ్గడమే తప్ప, పెరిగే అవకాశం లేదని ఎస్‌బీఐ రీసెర్చి తేల్చి చెప్పింది. 2026 మార్చితో ముగిసే వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ కీలక రెపోరేటును 1.25 శాతం నుంచి 1.5 శాతం వరకు...

మార్చిలోగా మరో 1.5% కోత..ఎస్‌బీఐ రీసెర్చి

న్యూఢిల్లీ: దేశంలో వడ్డీరేట్లు మరింత తగ్గడమే తప్ప, పెరిగే అవకాశం లేదని ఎస్‌బీఐ రీసెర్చి తేల్చి చెప్పింది. 2026 మార్చితో ముగిసే వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ కీలక రెపోరేటును 1.25 శాతం నుంచి 1.5 శాతం వరకు తగ్గించే అవకాశం ఉందని అంచనా వేసింది. గత నెల జరిగిన ఎంపీసీ భేటీలో ఆర్‌బీఐ రెపోరేటును 6.25 శాతం నుంచి ఆరు శాతానికి తగ్గించింది. వచ్చే ఏడాది మార్చిలోగా మరో ఒక శాతం నుంచి 1.25 శాతం తగ్గించే అవకాశం ఉందని ‘ద్రవ్యోల్బణం, రేట్ల కోత గమనం’ పేరుతో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. జూన్‌, ఆగస్టుల్లో జరిగే ఎంపీసీ సమావేశాల్లో ముప్పావు శాతం, వచ్చే ఏడాది మార్చిలోగా జరిగే భేటీల్లో మరో అర శాతం రెపో రేటు తగ్గించే అవకాశం ఉందని అంచనా వేసింది.


కలిసొచ్చే అంశాలు: ఈ ఆర్థిక సంవత్సరం రిటైల్‌ ద్రవ్యోల్బణం నాలుగు శాతం మించే అవకాశం లేకపోవడం ఆర్‌బీఐ రెపోరేటు తగ్గింపునకు ప్రధానంగా దోహదం చేయనుంది. మార్చి రిటైల్‌ ద్రవ్యోల్బణం ఇప్పటికే 67 నెలల కనిష్ఠ స్థాయి 3.34 శాతానికి దిగొచ్చింది. ప్రస్తుత ధరల ప్రకారం జీడీపీ వృద్ధిరేటు సైతం తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర శాతం మధ్యన ఉండవచ్చునని అం చనా. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ రేపోరేటును పావు శాతం చొప్పున కాకుండా ఒకేసారి అర శాతం చొప్పున తగ్గిస్తే, ఆర్థిక వ్యవస్థపై ఆ ప్రభావం త్వరగా కనిపిస్తుందని ఎస్‌బీఐ రెసెర్చి అంచనా. ఈ సంవత్సరం డాలర్‌తో రూపాయి మారకం రేటు కూడా రూ.85-87 మధ్య స్థిరపడే అవకాశం ఉందని తెలిపింది.

ఇవి కూడా చదవండి:

ఇప్పటికీ జనాల వద్ద రూ.2 వేల నోట్లు.. ఆర్బీఐ తాజా అప్‌డేట్ ఏంటంటే..

వాణిజ్యాన్ని ఆయుధంగా వాడొద్దన్న వారెన్ బఫెట్

Read More Business News and Latest Telugu News

Updated Date - May 06 , 2025 | 04:50 AM