ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఫ్యూచర్‌ బెస్ట్‌ బ్రాండ్లలో రిలయన్స్‌కు రెండో స్థానం

ABN, Publish Date - Feb 18 , 2025 | 01:50 AM

దేశంలో అతిపెద్ద, అత్యంత విలువైన కార్పొరేట్‌ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) మరో ఘనత సాధించింది. 2024 సంవత్సరానికి గాను విడుదల చేసిన ‘ఫ్యూచర్‌బ్రాండ్‌...

  • 2023తో పోలిస్తే 11 స్థానాలు పైకి..

  • ఆర్‌ఐఎల్‌ ముందు యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌ సైతం దిగదుడుపే..

  • ‘ఫ్యూచర్‌బ్రాండ్‌ ఇండెక్స్‌ 2024’ విడుదల

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద, అత్యంత విలువైన కార్పొరేట్‌ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) మరో ఘనత సాధించింది. 2024 సంవత్సరానికి గాను విడుదల చేసిన ‘ఫ్యూచర్‌బ్రాండ్‌ ఇండెక్స్‌’లో రిలయన్స్‌ ప్రపంచంలోని రెండో అత్యుత్తమ బ్రాండ్‌గా నిలిచింది. 2023లో 13వ స్థానంలో ఉన్న రిలయన్స్‌.. ఈసారి ఏకంగా 11 స్థానాలు ఎగబాకి ద్వితీయ ర్యాంక్‌ను దక్కించుకుంది. ఈ విషయంలో అంతర్జాతీయ దిగ్గజ బ్రాండ్లైన యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, నైకీ, వాల్ట్‌డిస్నీ, నెట్‌ఫ్లిక్స్‌, ఇంటెల్‌, టయోటా కంటే ముందుండ టం గమనార్హం. ఈ జాబితాలోని ఏకైక భారత బ్రాండ్‌ రిలయన్సే కావడం మరో విశేషం. కాగా, దక్షిణకొరియా ఎలకా్ట్రనిక్స్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ ఈసారి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.


మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా మారుతూనే బ్రాండ్‌ లక్ష్యం, అనుభవాన్ని సమతుల్యం చేసుకోగలిగే సామర్థ్యం ఆధారంగా ఫ్యూచర్‌బ్రాండ్‌ కంపెనీల మదింపును చేపట్టింది. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా పీడబ్ల్యూసీ లిస్ట్‌ చేసిన ప్రపంచ టాప్‌-100 కంపెనీలను పరిశీలించి, కంపెనీల ఆర్థిక పనితీరుకు బదులు బ్రాండ్‌ అనుభవం ఆధారంగా ర్యాంకింగ్‌లు కేటాయించింది. అత్యుత్తమ ఫ్యూచర్‌ బ్రాండ్లు తమ ప్రధాన గుర్తింపును కాపాడుకుంటూనే మారుతున్న వినియోగదారుల అంచనాలు, సాంకేతిక పురోగతులు, మార్కెట్‌ స్థితిగతులను చాకచక్యంగా ఒడిసిపట్టుకోగలుగుతాయి. మేమేంటి.. మా మనుగడ ఏంటి అనే అంశాలపై వాటికి స్పష్టమైన అవగాహన ఉందని ఫ్యూచర్‌బ్రాండ్‌ ఇండెక్స్‌ రిపోర్టు పేర్కొంది.



ఇవి కూడా చదవండి:

Viral News: పార్లమెంటులో అబద్ధం చెప్పిన ఎంపీ.. ఫైన్ విధించిన కోర్టు, పదవి కూడా..


CBSE Board Exam 2025: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష పేపర్ లీక్.. బోర్డ్ క్లారిటీ


Best FD Rates: సీనియర్ సిటిజన్లకు గ్యారెంటీడ్ రిటర్న్స్.. రూ. లక్ష FDపై ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందంటే..


New FASTag Rules: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. ఇవి పాటించకుంటే ఫైన్..

New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..


BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 18 , 2025 | 01:50 AM