CBSE Board Exam 2025: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష పేపర్ లీక్.. బోర్డ్ క్లారిటీ
ABN , Publish Date - Feb 17 , 2025 | 04:33 PM
సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష పేపర్ లీక్ అయినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) స్పష్టతనిచ్చింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

గత కొన్ని రోజులుగా CBSE 12వ తరగతి పరీక్ష పేపర్ లీక్ (Paper Leak Rumors) అయినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పుకార్లు వస్తున్నాయి. ఈ అంశంపై తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) స్పందించింది. ఇది విద్యార్థులు, తల్లిదండ్రులలో అనవసరమైన భయాందోళనలను సృష్టించే ఉద్దేశమని, ఇవి నిరాధారమైన వాదనలని బోర్డ్ స్పష్టం చేసింది. ఫిజిక్స్ వాల్లా వ్యవస్థాపకుడు అలఖ్ పాండే 'CBSE బోర్డు పరీక్ష 2025 పేపర్ అవుట్' అనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో బోర్డ్ క్లారిటీ ఇచ్చింది.
వీడియో వైరల్..
ఓ ఎడ్‌టెక్ కంపెనీ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభమయ్యే తన 4 రోజుల క్లాసులకు హాజరు కావాలని విద్యార్థులను కోరాడు. ఆ క్రమంలో CBSE బోర్డు పరీక్ష 2025లో వచ్చే ప్రశ్నల గురించి చర్చిస్తానని ప్రకటించాడు. ఈ క్రమంలో CBSE ప్రశ్నాపత్రాన్ని సెట్ చేసిన వ్యక్తులను తాను తెలుసుకున్నానని, బోర్డు పత్రంలో తన ప్రశ్నలు ఉంటాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన ఈ వీడియో కొన్ని గంటల్లోనే వైరల్ అయ్యింది. దీంతో CBSE బోర్డు తప్పుడు సమాచారం, పరీక్ష సమగ్రతను ప్రస్తావిస్తూ ఒక సర్క్యూలర్ జారీ చేసింది.
చర్యలు తీసుకుంటాం..
ఈ సందర్భంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని CBSE స్పష్టం చేసింది. ఇలాంటి కార్యకలాపాలలో పాల్గొన్నట్లు తేలితే, ఆయా వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బోర్డు వెల్లడించింది. ఈ క్రమంలో తప్పుడు సమాచారం విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. పుకార్లను నమ్మోద్దని కోరింది. పరీక్షకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in ద్వారా తెలియజేస్తామని బోర్డ్ స్పష్టం చేసింది.
ఈ పుకార్లు నిజమని నమ్మితే, విద్యార్థులు చదువు మాత్రమే కాకుండా, వారి భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుందని బోర్డ్ హెచ్చరించింది. ఇక ఫిబ్రవరి 21న CBSE 12వ తరగతి ఫిజిక్స్ ఎగ్జామ్ జరగనుండగా, ఫిబ్రవరి 27న కెమిస్ట్రీ, మార్చి 25న బయాలజీని నిర్వహించనున్నారు. ఈ నెల 15న మొదలైన ఈ పరీక్షలు ఏప్రిల్ 4, 2025 వరకు కొనసాగనున్నాయి.
ఇవి కూడా చదవండి:
New FASTag Rules: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. ఇవి పాటించకుంటే ఫైన్..
New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Next Week IPOs: ఈ వారం కీలక ఐపీఓలు.. మరో 6 కంపెనీల లిస్టింగ్
Read More Business News and Latest Telugu News